E-Paper
Advertisement

ఓటీటీలోకి సూర్య, త్రిషల బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘కరుప్పు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీలోకి సూర్య, త్రిషల బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘కరుప్పు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Advertisement

Karuppu OTT Release: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’ (Karuppu) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమా ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో విడుదలై ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.

Read also-This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘కరుప్పు’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. జూన్ 12 నుండి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. తమిళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల ఆడియో ఆప్షన్స్ కూడా స్ట్రీమింగ్ సమయంలో అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

4వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద హవా

థియేటర్లలో విడుదలైన నాల్గవ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను సాధిస్తోంది. ప్రముఖ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘శాక్‌నిల్క్’ (Sacnilk) ప్రకారం.. ఈ చిత్రం తన 24వ రోజున ఇండియా నెట్ కలెక్షన్లలో దాదాపు రూ.1.75 కోట్లు రాబట్టింది. ఇది అంతకుముందు రోజు (రూ.1.47 కోట్లు) కలెక్షన్లతో పోలిస్తే 19 శాతం వృద్ధిని చూపించడం విశేషం.

దీంతో ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

భారతదేశం నెట్ వసూళ్లు: దాదాపు రూ.193.40 కోట్లు

భారతదేశం గ్రాస్ వసూళ్లు: దాదాపు రూ.223.54 కోట్లు

ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు: దాదాపు రూ.80.60 కోట్లు

ప్రపంచవ్యాప్త మొత్తం గ్రాస్ వసూళ్లు: దాదాపు రూ.304.14 కోట్లు

Read also-తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ హవా.. బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి దూసుకెళ్తున్న గ్లోబల్ స్టార్!

సినిమా కథాంశం
ఈ సినిమా ఒక దొంగిలించబడిన నగల కేసు, అలాగే ఒక అమాయక తండ్రీకూతుళ్ల (ఇంద్రన్స్, అనఘా మాయా రవి) చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదటి భాగం వారి నిస్సహాయత, న్యాయం కోసం వారు చేసే పోరాటాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ సాగుతుంది. మానవ రూపంలో భూమిపై బ్రతకవలసి వచ్చిన ఒక దేవుడిని, ఒక సామాన్య మానవుడు ఎలా ఎదిరించాడు అనే ఆసక్తికరమైన ఫాంటసీ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.

Related News

మెగా ఫ్యాన్స్ కి షాక్.. రామ్ చరణ్ కు సర్జరీ..?

పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత తల్లైన అయిన ‘శీను వాసంతి లక్ష్మీ’ బ్యూటీ!

పదహారేళ్లకే టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. అప్పుడే షూటింగ్ పూర్తి!

బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్!

చిట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?

Big Stories

Advertisement
×