Upcoming Toyota Cars in India: టయోటా భారత మార్కెట్లో ఇప్పటికే ఇన్నోవా, ఫార్చ్యూనర్ లాంటి సక్సెస్ ఫుల్ మోడళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు పలు కొత్త కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో టయోటా నుంచి పలు కొత్త SUVలు, MPVలు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కార్ల కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో న్యూ జెనరేషన్ ఫార్చ్యూనర్ ఒకటి. ఈ SUV 2026 చివర్లో లేదంటే, 2027 ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది రానుంది.
టయోటా హిలక్స్ పికప్ ట్రక్ న్యూ జెనరేషన్ వెర్షన్ కూడా 2026 చివర్లో రావొచ్చు. ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజిన్ తో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అవకాశముంది.
మిడ్-సైజ్ SUV విభాగంలో హైరైడర్ కు 7-సీటర్ వెర్షన్ ను టయోటా తీసుకురానుంది. 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో హైరైడర్ ఫేస్‌లిఫ్ట్ కూడా మార్కెట్లోకి రానుంది. కొత్త టచ్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ADAS లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇన్నోవా హైక్రాస్ కు కూడా 2026 చివర్లో ఫేస్ లిఫ్ట్ అప్ డేట్ వచ్చే అవకాశముంది. కొత్త డిజైన్ తో పాటు మరిన్ని ఫీచర్లు ఇందులో జోడించనున్నారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి.
ఆఫ్ రోడ్ ప్రియులు ఎదురుచూస్తున్న ల్యాండ్ క్రూయిజర్ FJ కూడా భారత మార్కెట్లోకి రానుంది. బాక్సీ డిజైన్, లాడర్ ఫ్రేమ్ ప్లాట్ ఫామ్ తో ఈ SUV 2027 చివర్లో లేదంటే 2028 ప్రారంభంలో విడుదల కావచ్చు.
అర్బన్ క్రూయిజర్ టైసర్ కు హైబ్రిడ్ వెర్షన్ కూడా రాబోతోంది. ఈ మోడల్ 2026-27 మధ్యకాలంలో విడుదల కావచ్చు. లీటరుకు 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టయోటా దూకుడు పెంచనుంది. 2028లో కొత్త ఎలక్ట్రిక్ MPVని తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 40 kWh, 60 kWh బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి రావచ్చు.
అదే సమయంలో IMV 0 ప్లాట్ ఫారమ్ పై తయారు కానున్నకొత్త రగ్గడ్ SUVను కూడా టయోటా అభివృద్ధి చేస్తోంది. 2028లో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక 2028-29 మధ్యకాలంలో కొరోలా క్రాస్ 7-సీటర్ SUVను కూడా భారత్ కు తీసుకురావాలని టయోటా ప్రణాళికలు రూపొందిస్తోంది.
మొత్తంగా రాబోయే రెండు సంవత్సరాల్లో టయోటా నుంచి హైబ్రిడ్, ఎలక్ట్రిక్, ప్రీమియం SUVల రూపంలో పలు మోడల్స్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
Read Also: హీరో సంచలన ప్రకటన.. ఇక అన్ని బైకులు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లోనే!