E-Paper
Advertisement

అక్కినేని కంటే క్రేజ్.. విదేశీ కార్లలో షికార్లు.. కట్ చేస్తే చివరకు కారు డిక్కీలో అనాథ శవంలా!

అక్కినేని కంటే క్రేజ్.. విదేశీ కార్లలో షికార్లు.. కట్ చేస్తే  చివరకు కారు డిక్కీలో అనాథ శవంలా!
Advertisement

Kasturi Siva Rao : దీపం ఉన్నప్పుడే ఇళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఎందుకంటారో ఈ ఇన్సిడెంట్ చూస్తే మరోసారి అర్థం అవుతుంది.

కస్తూరి సాంబశివరావ్ … ఈ పేరు ఈ తరం వాళ్లకి అంతగా తెలీక పోవచ్చు. అలనాటి సినిమాలని ఇష్టంగా చూసేవారికి ఈయన బాగా పరిచయం. ఈకాలంలో బ్రహ్మానందం ఎలానో అప్పట్లో పాత సినిమాలకి ఆయన అలా అన్న మాట. ముఖ్యంగా సినిమా మొదలైన తొలినాళ్ళలో అంటే 1940వ కాలంలో ఆయన లేకపోతే సినిమానే లేదు అన్నంత క్రేజ్ ఉండేదంటే అర్థం చేసుకోండి. అలాంటి కస్తూరి అనాథ చావు చస్తాడని ఎవరైనా ఊహిస్తారా?

Advertisement

అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్

కస్తూరి సాంబశివరావ్ ఆలియాస్ కస్తూరి శివరావు కాకినాడలో మార్చి 6, 1913న జన్మించారు. ఇక చిన్నప్పటి నుండే నటన అంటే ఇష్టం ఉన్న శివరావ్ మూకీ సినిమాల నుండే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అలా సినిమాలు చేసుకుపోతున్న శివరావు, 1949లో వచ్చిన ‘గుణసుందరి కథ’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఇందులో ఆయన వాడిన ‘గిడిగిడి’ అనే ఊతపదం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన ‘బాలరాజు’ సినిమాతో ఆయన పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది.

Advertisement

ఇక అప్పటికే సినిమాలలో హీరోగా పాతుకుపోతున్న అక్కినేని నాగేశ్వరరావే స్వయంగా “బాలరాజు సినిమా రిలీజ్ అయ్యాక నేను కస్తూరి బయటికి వెళ్తే హీరో అయిన నాకంటే, శివరావుని చూసేందుకే జనం ఎగబడేవారు” అని చెప్పారంటే కస్తూరి శివరావ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంతలా మెప్పించాడో అర్థం అవుతుంది.

also read :భార్య ముందే ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో మాటలు.. జాకీ భగ్నానీ ఓపెన్ స్టేట్‌మెంట్‌పై రకుల్ ఏమందంటే?

విదేశీ కార్లు.. విలాసవంతమైన జీవితం

ఇక వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేసుకుపోయిన శివరావ్ ఎంతలా డబ్బు వెనకేశాడంటే మద్రాస్ ధనికుల ఇళ్ళల్లో మాత్రమే ఉండే కాస్ట్లీ ‘బ్యూక్’ కారుని సొంతం చేసుకునేంత. ఇక ఆ కారు రోడ్డు మీద వెళ్తుంటే ఆయన్ని చూడటానికే కార్ వెనకాల కిలోమీటర్ల కొద్ది పరుగులు తీసేవారంటే సినిమాలపై శివరావ్ కామెడీ స్టాంప్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఒకానొక దశలో ఆయన ఉంటే సినిమా హిట్టే అన్న గ్యారంటీ ఉండేదట.

అయితే నటుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న కస్తూరి శివరావ్ అక్కడితో ఆగిపోకుండా 1950లో సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి అక్కినేని నాగేశ్వరరావు, గిరిజలతో సినిమాలు కూడా నిర్మించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా క్రమ క్రమంగా ఆడియన్స్ టేస్ట్ మారడం, అదే సమయంలో రేలంగి, బాలకృష్ణ వంటి కమెడియన్స్ ఇండస్ట్రీలోకి రావడంతో కస్తూరి శివరావ్ డౌన్ ఫాల్ మొదలైంది.

అయితే అప్పటికే విపరీతమైన స్టార్‌డమ్ చూసిన కస్తూరి అవకాశాలు అడగడం నామోషీగా ఫీల్ అయ్యాడు.“నేనొక స్టార్.. వాళ్ళే పిలిచి అవకాశాలు ఇవ్వాలి” అన్న ఇగో అడ్డం రావడం వల్ల నిర్మాతలు ఆయన్ని క్రమంగా దూరం పెట్టిన పరిస్థితి. ఇక ఒకవైపు సినిమాలు లేకపోవడం, మరో వైపు డబ్బులని విచ్చల విడిగా ఖర్చు పెట్టేయడం ఆయన జీవితాన్ని అతలా కుతలం చేసేశాయి.

 కారు డిక్కీలో పార్థివ దేహం

ఇక చేతిలో చిల్లి గవ్వ లేని సమయంలో చివరికి పొట్ట గడవడానికి చిన్న చిన్న నాటకాల్లో నటించే స్థాయికి దిగజారిపోయారు. అలా 1966లో ఒక నాటకం కోసం తెనాలి వెళ్లిన కస్తూరి శివరావ్, అనారోగ్యంతో అక్కడి రైల్వే స్టేషన్‌లోనే కన్నుమూశారు. ఒకప్పుడు వేలమంది అభిమానుల మధ్య తిరిగిన ఆ స్టార్ కమెడియన్ చివరి రోజుల్లో చనిపోతే కొన్ని గంటల పాటు ఒక్కరు కూడా గుర్తు పట్టకపోవడం బాధాకరం.ఇక ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. ఆయన పార్థివ దేహాన్ని మద్రాసుకు తరలించడానికి అంబులెన్స్ కూడా లేక, ఒక పాత కారు డిక్కీలో కుక్కి తీసుకెళ్లడమే. దారిలో ఆ కారు చెడిపోవడంతో మూడు రోజుల తర్వాత కానీ ఆయన పార్థివ దేహం గమ్యస్థానానికి చేరలేదు.అలా అధ్బుతంగా మొదలైన శివరావ్ ప్రయాణం ఇలా దిక్కులేని అనాధలా ముగిసిపోయిందన్న మాట.

ఏది ఏమైనా  సినీ ఇండస్ట్రీలో శిఖరాలని చూసిన ఒక గొప్ప నటుడికి దక్కిన అత్యంత దారుణమైన, బాధాకరమైన వీడ్కోలు ఇది అని చెప్పకతప్పదు.

also read :ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. మళ్లీ ఆ మొహం చూడను – ప్రగతి షాకింగ్ కామెంట్స్

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×