E-Paper
Advertisement

భార్య ముందే ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో మాటలు.. జాకీ భగ్నానీ ఓపెన్ స్టేట్‌మెంట్‌పై రకుల్ ఏమందంటే?

భార్య ముందే ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌తో మాటలు.. జాకీ భగ్నానీ ఓపెన్ స్టేట్‌మెంట్‌పై రకుల్ ఏమందంటే?
Advertisement

Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్… ధ్రువ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన ఈ పంజాబీ సుందరి 2024లో బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిని ‘సిట్యుయేషన్‌షిప్’ అంటూ జాకీ చేసిన కామెంట్స్ నెట్టింట్లో మంటలు పెట్టేశాయ్. దీంతో అసలు విషయం తెలుసుకోకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు డిబేట్లు పెట్టేయడం ఆపండి అంటూ తెగ ఫైర్ అయింది రకుల్. ఇంతకీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ ఇష్యూ అసలు సంగతేంటో చూసేద్దామా!

అసలు జాకీ ఏమన్నాడు?

Advertisement

ఈమధ్య జిందాబాద్ యూట్యూబ్ టాక్ షోలో జాకీ మాట్లాడుతూ.. రకుల్ కి, నాకు పెళ్లి అయిందన్న మాటే కాని మేము ఒక రకమైన ‘సిట్యుయేషన్‌షిప్’లో ఉన్నాం. అది ఎంతలా అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా ఏ మాత్రం భయపడకుండా, తన ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడేంత. అంటూ ఇద్దరి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉంటుందో, భార్యాభర్తలనే కండిషన్స్ కంటే ఒకరి దగ్గర మరొకరికి ఎంత చనువు ఉంటుందో ఉదాహరణతో చెప్పుకొచ్చాడు జాకీ.

ఇక ఇదే టాక్ షోలో మాట్లాడుతూ మేమిద్దరం చిన్నపిల్లలం కాదని, లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసే ఇక్కడిదాకా వచ్చామని చెప్పుకొచ్చాడు. ఇక “నేను డిప్రెషన్‌లో ఉంటే, ఎవరు వచ్చినా నా పరిస్థితి మారదు. ఎందుకంటే సంతోషం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. రకుల్ రావడమే నా లైఫ్‌కు పెద్ద ప్లస్” అంటూ రకుల్ పై తనకున్న ప్రేమనంతా కురిపించాడు కూడా.

Advertisement

also read :ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. మళ్లీ ఆ మొహం చూడను – ప్రగతి షాకింగ్ కామెంట్స్

రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా

అయితే జాకీ రకుల్ పై అంత ప్రేమని ఒలకబోసినా కూడా వాళ్ళ మధ్య ఉండే ఫ్రీడమ్ గురించి చెబుతూ పలికిన ‘సిట్యుయేషన్‌షిప్’ అనే పదాన్ని పట్టుకుని నానా అర్థాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. ఇక మీడియాలో కూడా వాళ్ళ రిలేషన్ పై నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ అవడంతో అలెర్ట్ అయిన రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఫైర్ అవుతూ నిజమేంటో క్లారిటీ ఇచ్చింది.

టాక్ షో గంట పాటు జరిగిందని, కానీ అదేం చూడకుండా కేవలం ‘సిట్యుయేషన్‌షిప్’ అనే ఒకే ఒక పదాన్ని పట్టుకొని తప్పుడు అర్థాలు వచ్చేలా నానా యాగీ చేస్తున్నారని, కేవలం క్లిక్ బైట్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మానేయండంటూ కౌంటర్ ఇచ్చింది. తమ రిలేషన్ షిప్ ఎంత ఫెయిర్ గా ఉంటుందో చెప్పే ప్రయత్నంలో భాగంగా ‘సిట్యుయేషన్‌షిప్’ అనే పదాన్ని వాడాడే తప్ప మరో అర్థం లేదంటూ కుండబద్దలు కొట్టేసింది.

చెంపల్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో వాయించేసింది

ఇక ఇప్పటికైనా ఏమి చెప్పారో అనే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎవరికి వారు న్యూస్ క్రియేట్ చేయడం మంచిది కాదంటూ రాసుకొచ్చింది రకుల్.మొత్తానికి భర్త జాకీ భగ్నానీ చేసిన కామెంట్స్ ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళ చెంపల్ని ఇలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో వాయించేసింది అన్న మాట!

also read :మృణాల్ ‘గ్లామర్’ డోస్.. తెలుగులో సీతమ్మ, హిందీలో మాత్రం రచ్చ రంబోలా!

Rakul Preeth Singh

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×