E-Paper
Advertisement

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్‌ను మరోసారి కొల్లగొడుతున్న ఖాత్యాయని..!

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్‌ను మరోసారి కొల్లగొడుతున్న ఖాత్యాయని..!
Advertisement

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో నిజంగానే అందరి హార్ట్.. కొల్లగొట్టిన హీరోయిన్ శివాని నాగారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఆమె అభిమానుల హృదయాలను మరింత ఆకట్టుకుంటుంది. తన సహజమైన చిరునవ్వుతో..సింపుల్ లుక్‌తో.. ఈ ఫోటోలలో ఎంతో అందంగా కనిపించింది ఈ హీరోయిన్. ఆర్టిఫిషియల్ హంగులు లేకుండా.. సాధారణంగా కనిపించడమే ఆమె ప్రత్యేకత అని ఈ ఫోటోలు మరోసారి రుజువు చేశాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోకి మంచి స్పందన వస్తోంది.

ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ సినిమాతో అందరికీ పరిచయమైన..శివాని నాగారం లిటిల్ హార్ట్స్ సినిమాతో మరింత పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె చేసిన ఖాత్యాయని పాత్ర ప్రేక్షకుల మనసుల్లో బలంగా నిలిచిపోయింది. ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులకు చాలా నచ్చడంతో.. ఇప్పటికీ చాలామంది ఆమెను ఖాత్యాయని అనే పేరుతోనే పిలుస్తుంటారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా “ఖాత్యాయని” పాటను చాలామంది రీల్స్‌గా చేశారు.

Advertisement

ఇక శివాని పర్సనల్ లైఫ్ కి వస్తే.. ఆమె హైదరాబాద్ అమ్మాయి. చిన్నప్పటి నుంచి సంగీతం, నృత్యం ఆమె జీవితంలో భాగంగా పెరిగారు. ఆమె తల్లి వైపు కుటుంబంలో చాలామంది శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. శివాని కూడా కూచిపూడి నేర్చుకుంది. నటిగా మారకపోతే ఫ్యాషన్ డిజైనర్‌గా లేదా సంగీత రంగంలో ఉండేదానినని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. చిన్నప్పుడే లెహెంగాల డిజైన్లు గీయడం..పెళ్లి డ్రెస్సుల గురించి ఊహించుకోవడం ఆమెకు చాలా ఇష్టంట.

Advertisement

విద్య విషయానికి వస్తే..ఆమె బీకాం పూర్తి చేసి.. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ చేసింది. కాలేజ్ రోజుల్లో ఫిల్మ్‌మేకింగ్ సబ్జెక్ట్ ఉండడంతో సినిమాలపై ఆసక్తి పెరిగింది. మొదటిసారి సరదాగా ఆడిషన్‌కు వెళ్లిన శివాని.. అనుకోకుండా షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. అదే ఆమె కెరీర్‌కు మొదటి అడుగు అయ్యింది.

ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో అవకాశం రావడం ఆమె జీవితాన్ని మార్చేసింది. తొలి సినిమానే అయినా..ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ నిజమైన బ్రేక్ మాత్రం లిటిల్ హార్ట్స్ తో వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అనుభవం కాలేజ్ లైఫ్‌లా సరదాగా.. సాగిందని శివాని చెబుతూ ఉంటుంది.

ఫ్యాషన్ విషయంలో శివాని చాలా సింపుల్. సాధారణంగా టీషర్ట్, జీన్స్ ఇష్టపడుతుంది. పండుగలప్పుడు మాత్రం పట్టు చీర, వడ్డాణంతో పూర్తిగా తెలంగాణ అమ్మాయిలా కనిపిస్తుందట. షూటింగ్ లేనప్పుడు ఇంట్లోనే ఉండడం, వంట చేయడం, డైరీ రాయడం ఆమెకు ఇష్టంట.. ఈ విషయాలు అన్నీ కూడా ఈ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకోండి.

ALSO READ: Chinmayi Sripada: చిన్మయి కాంట్రవర్సీ… ఆ మూవీ నుంచి అవుట్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×