E-Paper
Advertisement

Chinmayi Sripada: చిన్మయి కాంట్రవర్సీ… ఆ మూవీ నుంచి అవుట్

Chinmayi Sripada: చిన్మయి కాంట్రవర్సీ… ఆ మూవీ నుంచి అవుట్
Advertisement

Chinmayi Sripada: చిన్మయి శ్రీపాద కి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో పెట్టలేసుకున్న చర్చలకు దారి చూస్తూ ఉంటుంది. అందుకు ముఖ్య కారణం ఈమె ప్రతి చిన్న విషయానికి కూడా సోషల్ మీడియాలో… పెద్ద చర్చలు తీసుకురావడం. నిన్న మొన్నటి వరకు శివాజీ అమ్మాయిల గురించి మాట్లాడిన విషయంపై చిన్మయి శ్రీపాద ఎన్ని పోస్టులు పెట్టిందో మనందరికీ తెలిసిందే. ఇలా అన్ని విషయాలకు ఈమె సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఇప్పుడు చిన్మయి పాడిన ఒక పాట వల్ల మరోసారి కాంట్రవర్సీలో నిలిచింది. ఆమె పాడిన “ఎమ్‌కోనే” అనే పాటను సినిమా ద్రౌపతి 2 నుంచి తొలగించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయంపై ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది.

Advertisement

చిన్మయి శ్రీపాద తన అభిప్రాయాలు..సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ స్పష్టంగా ఉండే వ్యక్తి అని తెలిసిందే. ఏ పరిస్థితుల్లోనైనా తాను నమ్మిన దానికే నిలబడతానని ఆమె గతంలోనే పలుమార్లు చెప్పింది. “ఎమ్‌కోనే” పాట పాడిన సమయంలో ఈ సినిమా కథ..నేపథ్యం తనకు పూర్తిగా తెలియదని చిన్మయి స్పష్టం చేసింది. ఓక ఈ సినిమా “మూండ్రం వల్లల్ల మహారాజా” అనే చరిత్ర ఆధారిత పుస్తకం మీద రూపొందిందని.. తెలుసుకున్న తర్వాత వెంటనే.. ఈ గాయని స్పందించింది.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే చిన్మయి ఒక క్షమాపణ ప్రకటన సైతం విడుదల చేసింది. తన ఆలోచనలకు, ఆ పాట నేపథ్యానికి పొంతన లేదని ఆమె చెప్పింది. అంతేకాదు..ఈ వివాదం వల్ల సంగీత దర్శకుడు గిబ్రాన్.. ఇబ్బంది పడాల్సి రావడం పట్ల కూడా ఆమె తన క్షమాపణ.. వ్యక్తం చేసింది. తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలంటూ ఆమె తెలియజేసింది.

Advertisement

చిన్మయి ప్రకటన తర్వాత ద్రౌపతి 2 చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పాటలో చిన్మయి వాయిస్‌ను తీసేసి.. మరో గాయనితో మళ్లీ రికార్డ్ చేయాలని నిర్ణయించారు. విడుదల కాబోయే ఫైనల్ ప్రింట్‌లో కొత్త వాయిస్ మాత్రమే ఉంటుందని వారు ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.

ఈ విషయంలో దర్శకుడు మోహన్ జి.. కూడా స్పందించారు. ఈ వివాదంతో కొంతకాలం సినిమా బృందంపై విమర్శలు వచ్చినా..చివరికి ఇరు వర్గాలు స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకున్నాయి. సినిమా ఇప్పటికే సెన్సార్ బోత్ అనుమతి పొందింది.

అసలు విషయానికి వస్తే.. మోహన్.జి ఎక్కువగా యాంటీ దళిత్ మూవీస్ తీస్తున్నారంటూ.. మొదటి నుంచీ ఈ దర్శకుడిపైన.. విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి ఆ సినిమాలో పాట పాడడంతో ముందే రియాక్ట్ అయ్యారు. “ఇది మోహన్ జి సినిమా అని నాకు ముందే తెలిసి ఉంటే.. నేను అసలు ఈ పాట పాడేదాన్ని కాదు..” అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో పాట నుంచి చిన్మయి వాయిస్ తీసేసి వేరొకరి వాయిస్ పెట్టడానికి సిద్ధమయ్యారు.

మొత్తానికి.. ఈ వివాదం ఇప్పటికి ముగిసింది. “ద్రౌపతి 2” త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సంఘటనతో.. పాటకు సంబంధించిన అంశం ఒక స్పష్టమైన ముగింపుకు వచ్చింది.

ALSO READ: Upasana Konidela: బేబీ బంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన…ఆ రూమర్లకు చెక్ !

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×