E-Paper
Advertisement

Revolver Rita Trailer: కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ మోడ్ లో మహానటి!

Revolver Rita Trailer: కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ మోడ్ లో మహానటి!
Advertisement

Revolver Rita Trailer: కీర్తి సురేష్ (Keerthi Suresh)ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “రివాల్వర్ రీటా” (Revolver Rita ). ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీటా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా రివాల్వర్ చేతపట్టాల్సి వస్తుంది. అయితే ఈ సంఘటన నుంచి రీటా ఎలా బయటపడిందనే ఈ సినిమా కథ అని తాజాగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ట్రైలర్ లాంచ్ చేసిన నాని..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జేకే చందు దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ రీటా అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈమెకు తల్లిగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar)నటించారు . ఇక ఈ సినిమాలో సునీల్, అజయ్ గౌస్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా నవంబర్ 28వ తేదీ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విడుదల కానుంది. మరి కామెడీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఫ్యాషన్ స్టూడియోస్ , ది రూట్ బ్యానర్ పై నిర్మించారు.

రౌడీ జనార్ధన్ సినిమాతో బిజీగా…

Advertisement

ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె చివరిగా ఉప్పుకప్పురంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్ధన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement

ఇక కీర్తి సురేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లి తర్వాత కీర్తి సురేష్ ఇండస్ట్రీకి దూరమవుతుందనే వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను ఖండిస్తూ ఈమె సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు. త్వరలోనే రౌడీ రీటా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Big tv Kissik Talks:  డ్రగ్స్ పై నటి జ్యోతి హాట్ కామెంట్స్… కచ్చితంగా ఆ పని చేస్తా అంటూ!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×