E-Paper
Advertisement

Big tv Kissik Talks: డ్రగ్స్ పై నటి జ్యోతి హాట్ కామెంట్స్… కచ్చితంగా ఆ పని చేస్తా అంటూ!

Big tv Kissik Talks: డ్రగ్స్ పై నటి జ్యోతి హాట్ కామెంట్స్… కచ్చితంగా ఆ పని చేస్తా అంటూ!
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈవారం సినీనటి జ్యోతి (Jyothi)పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా జ్యోతి తన సినీ కెరియర్ గురించి అలాగే తన కొడుకు , విషయాల గురించి ఈ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెకు రాజకీయాల (Politics) గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. జ్యోతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలలో నటించారు.

డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం..

ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న నేపథ్యంలో ఆయన పాలిటిక్స్ గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నాయకుడని ఆయన ఎంతో కష్టపడుతున్నారంటూ జ్యోతి తెలిపారు. ఈ తరుణంలోనే మీకు కనక ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు జ్యోతి సమాధానం చెబుతూ నేను కనుక ఒక రోజు సీఎం అయితే కచ్చితంగా అందరి చేత సేనోటు డ్రగ్స్ (Drugs)అనే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

డ్రగ్స్ ఆరోపణలను ఎదుర్కొన్న నటి..

Advertisement

ఇలా డ్రగ్స్ గురించి నటి జ్యోతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె డ్రగ్స్ విషయంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టు కావడంతో ఆయనతో ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలోనే నటి జ్యోతి పై కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదురయ్యాయి అయితే ఈ ఆరోపణలను ఈమె పూర్తిగా ఖండించారు. కేపీ చౌదరితో మాకు ఎలాంటి సంబంధం లేదని తన కొడుకు మా అబ్బాయి ఫ్రెండ్స్ కావడంతో ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలిసే వారు. అంతకుమించి అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా లేదని తెలిపారు.

Advertisement

ఇలా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న ఈమె తాజాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక జ్యోతి కెరియర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో హీరోయిన్ గా పెళ్ళాం ఊరెళితే అనే సినిమాలో కనిపించే సందడి చేశారు. అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇటీవల కాలంలో జ్యోతి పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరి ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం అవకాశాలు రాకపోవడమేనా? లేదంటే తనుకు నచ్చిన పాత్రలు రాకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా? అనే విషయాలు గురించి తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: Big tv Kissik Talks: మనిషిలో అది లేకపోతే ప్రతి ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×