Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా(Revolver Rita) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్(Keerthy Suresh) తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా కీర్తి సురేష్ తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు. కీర్తి సురేష్ దాదాపు 15 సంవత్సరాలు పాటు ఆంటోనీ తట్టిల్(Antony Thattil) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇలా 15 సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ ఎక్కడ కూడా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు. స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటిస్తూ కాబోయే వ్యక్తిని పరిచయం చేశారు. ఇక కీర్తి సురేష్ లవ్ రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారే తప్ప ఎక్కడ కూడా తన ప్రేమ విషయాన్ని తెలియజేయలేదు. తాజాగా రివాల్వర్ రీటా ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదో కీర్తి సురేష్ తెలిపారు. కీర్తి సురేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆంటోనీ తట్టిల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. అందుకే అందరి దృష్టి తనపై పడటం ఇష్టం లేదని తెలిపారు. ఇలా బయట అందరికీ పెద్దగా కనిపించని వ్యక్తిని బలవంతం చేస్తూ అందరి ముందుకు తీసుకురాలేమని అందుకే ఆంటోనీ విషయాన్ని రహస్యంగా ఉంచానని కీర్తి సురేష్ తెలిపారు.
ఇక కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా ఆంటోని కీర్తితో కలిసి పెద్దగా బయట కనిపించిన సందర్భాలు కూడా లేవు. అదేవిధంగా సోషల్ మీడియాకి కూడా ఈయన చాలా దూరంగా ఉంటారు. ఆంటోని తట్టిల్ కు తన వ్యక్తిగత జీవితం గురించి అన్ని విషయాలు షేర్ చేసుకోవడం పెద్దగా నచ్చదని, అందుకే ఆయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటారని కీర్తి సురేష్ పలు సందర్భాలలో తెలియ చేశారు.
రౌడీ జనార్దన్ షూటింగ్..
ఇలా సోషల్ మీడియాకు, సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండే ఆంటోని తట్టిల్ కీర్తి సురేష్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని అందరూ భావించారు కానీ పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాల పరంగా తన స్పీడ్ పెంచుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇక త్వరలోనే రివాల్వర్ రీటా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.