E-Paper
Advertisement

Singer Zubeen Garg Death: స్టార్ సింగర్‌ది ప్రమాదం కాదు… ప్లాన్ చేసి హత్య చేశారు.. అసెంబ్లీలో సీఎం ప్రకటన

Singer Zubeen Garg Death: స్టార్ సింగర్‌ది ప్రమాదం కాదు… ప్లాన్ చేసి హత్య చేశారు.. అసెంబ్లీలో సీఎం ప్రకటన
Advertisement

Singer Zubeen Garg Death: ప్రముఖ పాప్ సింగర్ జుబీన్ గార్గ్ (Zubeen Garg)మరణం పై ఎన్నో సందేహాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీ గార్గ్ సింగపూర్ లో ఈత కొడుతూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇలా గార్గ్ మరణం(Zubeen Garg death) పట్ల ఆయన కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తు చనిపోలేదని ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ (himanta Biswa sarma) జుబీన్ మరణం పై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, హత్యకు గురయ్యారు అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా పోలీసులు పలువురిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్..

52 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ గార్గ్ ఈత కొడుతూ మరణించడంతో పోలీసులు కూడా మొదట్లో ఈ మరణాన్ని సాధారణ మరణంగానే భావించారు.నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF)లో పాల్గొనడం కోసం గార్గ్ సింగపూర్ వెళ్లినట్టు తెలుస్తుంది.అయితే అక్కడ ఈత కొడుతూ మరణించినట్లు అందరూ భావించారు కానీ ఈయన మరణం పై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక దర్యాప్తును చేయించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల అదుపులోకి గార్గ్ సెక్యూరిటీ..

Advertisement

ఈ దర్యాప్తులో భాగంగా గార్గ్ మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదు పథకం ప్రకారమే ఈయనని హత్య చేసి చంపారని తెలిపారు. సుమారు నాలుగైదుగురు కలిసి ఈయనని హతమార్చినట్లు తెలుస్తుంది ఇందులో ఒకరు గార్గ్ ను చంపేయగా మరి కొంతమంది ఆయనకు సహాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడి అయింది ఇందులో భాగంగానే పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గార్గ్ సెక్యూరిటీ కూడా ఉండటం గమనార్హం. వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అయిన నందీశ్వర్ బోరా, ప్రబిణ్ బైశ్యా కూడా ఉన్నారు. వీరి ఖాతా నుంచి కోట్లలో నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా గార్గ్ హత్య చేయబడ్డారనే విషయం వెల్లడించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఈయనని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి ఎవరి ప్రోత్బలంతో హత్యకు పాల్పడ్డారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: I Bomma Ravi Arrest: మూడు దేశాలు తిప్పించారు… ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఐబొమ్మ రవి అరెస్ట్ ఎపిసోడ్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×