Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం రివాల్వర్ రీటా(Revolver Rita) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. లేడి ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 28వ తేదీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేష్ భారీ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహిస్తూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో ఉండే పురుషాధిక్యత గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా మేల్ డామినేషన్ (Male Domination)ఉందని, ఇది చేదు నిజం అని కీర్తి సురేష్ తెలియజేశారు. దీనికి ప్రేక్షకుల అభిప్రాయం కూడా ఎంతో ముఖ్యమని తెలియజేశారు. ఉదాహరణకు మీకు ఎంతో ఇష్టమైన హీరో, హీరోయిన్ సినిమాలు రెండు ఒకేరోజు విడుదలైతే ప్రేక్షకులందరూ హీరో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారే తప్ప హీరోయిన్ సినిమా చూడటానికి రారని, సినిమాకు మంచి టాక్ ఉంటే తప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ముందుకు రారని అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెద్దగా ఓపెనింగ్స్ ఉండవు అంటూ కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది సానుకూలంగా స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సినిమాల పరంగా హీరోలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది తప్ప హీరోయిన్లకు కాదు హీరోయిన్లు కేవలం గ్లామర్ షో కోసం పాటలు కోసం మాత్రమే పనికొస్తారని వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు అంటూ గత కొద్ది రోజులుగా హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కీర్తి సురేష్ కెరియర్ విషయానికి వస్తే ఈమె ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన జోనర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
యాక్షన్ కామెడీ సినిమాగా..
మొదటిసారి కీర్తి సురేష్ రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ కామెడీ సినిమాగా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు జే.కే చంద్రు దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, సునీల్, అజయ్ ఘోష్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి మరి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా రాబోతున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Varanasi: కుంభ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్…బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో!