E-Paper
Advertisement

Varanasi: కుంభ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్…బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో!

Varanasi: కుంభ పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్…బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో!
Advertisement

Varanasi: దర్శ దీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (S.S.Rajamouli)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వారణాసి(Varanasi). మహేష్ బాబు(Mahesh Babu) ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరో హీరోయిన్లుగా ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. హైదరాబాదులో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని, చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో మహేష్ మేనల్లుడు, నటుడు సుదీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ నటించబోతున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి.

కుంభ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్..

ప్రస్తుతం దర్శన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో కుంభ (Kumbha)పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Pruthviraj Sukumaran)నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే రణకుంభ అంటూ కుంభ పాత్రకు సంబంధించి ఒక సాంగ్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో ఈ పాత్ర ప్రాధాన్యత కూడా కీలకంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఇలాంటి తరుణంలోనే కుంభ పాత్ర కోసం రాజమౌళి ముందుగా పృథ్వి పేరును తీసుకురాలేదని, టాలీవుడ్ హీరోనే కుంభ పాత్రలో తీసుకోవాలని భావించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

కుంభ పాత్ర కోసం గోపీచంద్?

Advertisement

ఈ పాత్రలో నటించడం కోసం ముందుగా టాలీవుడ్ హీరో గోపీచంద్(Gopi Chand) అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించారట. అనుకోకుండా తెరపైకి పృథ్వీరాజ్ పేరు రావడంతో తనని ఫైనల్ చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు బయటకు రావడంతో గోపీచంద్ అభిమానులు మాత్రం ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత్రలో కనుక గోపీచంద్ నటించి ఉంటే ఆయన కెరియర్ కు ఎంతో ప్లస్ అయి ఉండేదని, బ్యాడ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రాముడిగా కనిపించనున్న మహేష్..

Advertisement

ఇటీవల కాలంలో గోపీచంద్ పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇలాంటి తరుణంలోనే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు సినిమాలో భాగం అయి ఉంటే ఈయన కెరియర్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటించగా మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నట్టు రాజమౌళి వెల్లడించడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: Hema Malini: ధర్మేంద్ర మృతి.. హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్.. శూన్యత అంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×