E-Paper
Advertisement

Modi Biopic: మోదీ బయోపిక్ లో కేజీఎఫ్ బ్యూటీ.. ఏ పాత్రకో తెలుసా?

Modi Biopic: మోదీ బయోపిక్ లో కేజీఎఫ్ బ్యూటీ.. ఏ పాత్రకో తెలుసా?
Advertisement

Modi Biopic: ఈ మధ్యకాలంలో ఏ భాషా ఇండస్ట్రీలో చూసినా సరే బయోపిక్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా నటీనటులకు సంబంధించి, రాజకీయ నాయకులకు అలాగే స్పోర్ట్స్, ఆర్మీ ఇలా ప్రతిరంగంలో కూడా అత్యున్నత ప్రతిభ కనబరిచి దేశానికి సేవ చేసిన వారి బయోపిక్లను తెరకెక్కిస్తూ.. వారి జీవిత కథలను అందరికీ తెలిసేలా చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో బయోపిక్ లు వచ్చి ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రజలలో పలు అవగాహన కల్పిస్తున్నారు.

మోదీ బయోపిక్ లో రవీనా టాండన్..

అయితే ఇప్పుడు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందులో కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అయ్యారు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ, కేజీఎఫ్ నటి రవీనాటాండన్ (Raveena Tandon). అసలు విషయంలోకి వెళ్తే…ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘మా వందే’ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని కృష్ణన్ (Unni Krishnan) ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా.. మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Heeraben modi) పాత్రలో బాలీవుడ్ నటి రవినాటాండన్ నటిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. కేజిఎఫ్ 2 చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

మా వందే సినిమా విశేషాలు..

Advertisement

భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత కథతో ‘మా వందే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వీర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రాంతి కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే నరేంద్ర మోదీకి తన అమ్మగారు హీరాబెన్ మోదీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన దేశ ప్రధానిగా, రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా సరే తన పుట్టినరోజును మాత్రం తన తల్లి వద్ద జరుపుకునే వారు. అలా మదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ బయోపిక్ రాబోతోంది. అందులోనే ఈ సినిమాకు కీలకమైన పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. ఇకపోతే రవీనా టాండన్ ఇప్పటికే కేజిఎఫ్ 2 చిత్రంలో భారత ప్రధాని పాత్ర పోషించి.. అందరిని మెప్పించిన విషయం తెలిసిందే.

ALSO READ:Payal Rajput: సె*క్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరి.. సిగ్గెందుకంటూ బోల్డ్ స్టేట్మెంట్!

రవీనా టాండన్ కెరియర్..

Advertisement

రవి టాండన్ కూతురిగా 1972 అక్టోబర్ 26న జన్మించిన ఈమె హిందీ చిత్రాలలో తన నటనతో ప్రసిద్ధి చెందింది. 1990లో ప్రముఖ నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న రవీనా నేషనల్ అవార్డుతో పాటు రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. 2023లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర గౌరవం అయిన పద్మశ్రీని కూడా దక్కించుకుంది రవీనా టాండన్.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×