Payal Rajput:ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాక్ స్వాతంత్ర్యం పేరిట ప్రతి విషయాన్ని కూడా బహిరంగంగా చర్చిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకప్పుడు రహస్యంగా దాచాల్సిన విషయాలను కూడా ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతూ.. తప్పేముంది అంటూ స్టేట్మెంట్ ఇస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఇలాంటి కామెంట్స్ చేయడమే కాకుండా.. జీవితంలో అది కూడా ఒక భాగమే.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బోల్డ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న పాయల్ రాజ్ పుత్ కూడా శృంగారంపై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal rajput) ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాలు మినహా దాదాపు చాలా సినిమాలలో ఊహించని గ్లామర్ వలకబోస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె శృం*గా*ర జీవితం గురించి మాట్లాడుతూ.. “మన జీవితంలో శృం*గా*రం అనేది ఒక భాగము. అయితే దీని గురించి మాట్లాడడానికి సిగ్గు ఎందుకు. ముఖ్యంగా ప్రతి విషయంలో ఎలా అయితే నార్మల్ గా చర్చిస్తాము. దీన్ని కూడా అలాగే చర్చించుకోవాలి. సె*క్స్ ఎడ్యుకేషన్ పై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి.
ముఖ్యంగా నెలసరి సమయంలో ఆడవాళ్లు ఎదుర్కొనే నొప్పి, ఒత్తిడి లాంటి విషయాల గురించి సినిమాల్లో చూపించడం వల్ల కొంత అవగాహన కల్పించవచ్చు. ఇలాంటి విషయాల గురించి ఓపెన్ గా చర్చించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి.. అవగాహన ఉంటే ఎటువంటి సమస్యలు రావు అని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే పాయల్ రాజ్ పుత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:SSMB 29 Song : సంచారీ సాంగ్‌లో శివతత్వం… ఆ లిరిక్స్‌లో ఉన్న అర్థాన్ని గమనించారా ?
అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మొదట్లో హీరోయిన్ గా నటించి క్లైమాక్స్లో విలన్ గా కనిపించి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో కూడా తన అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మెప్పించింది పాయల్ రాజ్ పుత్ .
ఇకపోతే ఇప్పుడు మంగళవారం సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. పాయల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. రోజుకు ఒక గ్లామర్ ఫోటోతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈమె ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. ఏదేమైనా పాయల్ రాజ్ పుత్ షేర్ చేస్తున్న ఈ ఫోటోలు తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.