E-Paper
Advertisement

Free Travel: రైల్లో పిల్లలకు టికెట్ ఉచితమేనా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

Free Travel: రైల్లో పిల్లలకు టికెట్ ఉచితమేనా.. కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
Advertisement

Free Travel for Kids:

ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే పిల్లల టిక్కెట్లను బుక్ చేసుకునే విధానంలో కీలక మార్పులు చేసింది. ఒకవేళ మీరు చిన్న పిల్లలో రైలు ప్రయాణం చేయాలనుకుంటే కొన్ని కీలక విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సింది. నిజానికి బస్సులు, రైళ్లలో 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. అయితే, పిల్లలకు స్పెషల్ సీటు లేదంటే బెర్త్ కావాలంటే ఈ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పిల్లల ప్రయాణానికి రైల్వే రూల్స్

రైల్వే టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవడానికి వయస్సు ఆధారంగా పిల్లల టిక్కెట్ల జారీకి రైల్వే ప్రత్యేక రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పిల్లలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, వారు రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడానికి అనుమతించబడతారు. అయితే, వారికి ప్రత్యేకమైన సీటు, బెర్త్ లభించదు. అంటే, పిల్లలను పెద్దలు తమ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లవచ్చు. అటు 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూల్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. వీరికి బెర్త్ లేదంటే సీటు అవసరం లేకపోతే  ‘నో సీట్/నో బెర్త్’ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. వారు సగం ఛార్జీతో ప్రయాణించడానికి అనుమతించబడతారు. అలా కాకుండా పిల్లలకు కూడా సీటు, లేదంటే బెర్త్ కావాలనుకుంటే మీరు టిక్కెట్ కు అయ్యే పూర్తి ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇక 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను రైల్వే పూర్తి పెద్దలుగా పరిగణిస్తుంది. వారికి టిక్కెట్ ధరలు సాధారణ  ప్రయాణీకుల మాదిరిగానే ఉంటాయి. బుకింగ్ చేసేటప్పుడు పిల్లలకు సరైన వయస్సు,  సీటు ఎంపికను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఏమాత్రం పొరపాటు చేసినా, టికెట్ రద్దు కావడంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

పిల్లలతో వెళ్లే పేరెంట్స్ కు బుకింగ్ టిప్స్  

మీరు పిల్లలతో రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. ముందుగా టిక్కెట్ బుకింగ్ చేసేటప్పుడు పిల్లలకు సంబంధించి సరైన వయస్సును ఎంటర్ చేయాలి. IRCTC వెబ్‌ సైట్, యాప్‌ లో బుకింగ్ చేసేటప్పుడు వయస్సును తప్పుగా నమోదు చేస్తే టికెట్ చెల్లుబాటు కాదు. ప్రయాణ సమయంలో పిల్లల వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు తీసుకెళ్లడం మంచిది. ఎందుకంటే రైల్వే టీసీ పిల్లల ఏజ్ ప్రూఫ్ అడిగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల కోసం అవసరమైన మందులు, నీరు, ఆహారం ఉన్న తేలికైన, సౌకర్యవంతమైన బ్యాగ్‌ ను తీసుకెళ్లడం మంచిది.  ఈ సింపుల్ టిప్స్ పిల్లలతో వెళ్లే ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Advertisement

Read Also: ఆ రూట్లో కొత్త వందే భారత్.. ఏకంగా 5 గంటల సమయం ఆదా!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×