E-Paper
Advertisement

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?
Advertisement

Chennai love story: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి కలర్ ఫోటో, బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్న సాయి రాజేష్ కథను అందించారు. ఆయన మాస్ మూవీ ప్రొడక్షన్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్కేఎన్ తో కలసి సాయి రాజేష్ ఈ ప్రాజెక్టును నిర్మించారు. జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విడుదల తేదీ దగ్గర పడుతుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ ఎలా ఉందంటే?

చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. తాజాగా హైదరాబాదులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటూనే.. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచేస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. చెన్నైలో ఉండే హీరోయిన్ అప్పటికే ప్రేమలో విఫలమై, ఆ బాధను మర్చిపోవడానికి ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఉంటుంది. సినిమా డైరెక్టర్ అవ్వాలని కలలు కన్న హీరో హైదరాబాద్ ను వదిలేసి చెన్నైకి వస్తాడు. అదే సమయంలో ఆమె ఉంటున్న చోటికి హీరో వస్తాడు. ఆమె మూడ్ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు అలా కొన్నాళ్లకు ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత వీరి లవ్ స్టోరీ ఎలాంటి టర్న్ తిరిగింది? ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? చివరకు ఏమైంది? అనేది సినిమా స్టోరీ లా అనిపిస్తోంది.

కిరణ్ ఖాతాలో హిట్?

Advertisement

మొత్తానికైతే ఎమోషనల్ గా హార్ట్ టచ్చింగ్ గా సాగిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. కిరణ్ ఖాతాలో ఈసారి హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎమోషనల్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

also read:72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

కిరణ్ అబ్బవరం కెరియర్:

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాయచోటిలో 1992 జూలై 15న జన్మించిన కిరణ్ అబ్బవరం.. బీటెక్ పూర్తి చేసి చెన్నై, బెంగళూరు ప్రాంతాలలో రెండున్నర సంవత్సరాల పాటు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరొక షార్ట్ ఫిలిం చేస్తూ.. తన కెరియర్ను ఆరంభించారు. అలా తొలిసారి ‘రాజా వారు రాణి గారు’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత నటించిన ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమాలో హీరోగా నటిస్తూనే.. రచయితగా కూడా పనిచేశారు. సెబాస్టియన్ పీఎస్24, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, దిల్ రూబా, క , కే – ర్యాంప్ , తిమ్మరాజు పల్లి టీవీ ఇలా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కిరణ్ అబ్బవరం. ఇక ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ తో పాటు క 2 లో కూడా నటిస్తున్నారు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×