E-Paper
Advertisement

Kiran abbavaram: రెమ్యూనరేషన్ డబుల్.. లైనప్ మామూలుగా లేదుగా!

Kiran abbavaram: రెమ్యూనరేషన్ డబుల్.. లైనప్ మామూలుగా లేదుగా!
Advertisement

Kiran abbavaram:యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత రెండు సంవత్సరాలుగా దీపావళిని టార్గెట్ గా చేసుకొని క, కె ర్యాంప్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో కిరణ్ మార్కెట్ పెరగడమే కాకుండా వరుస సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అలాగే మరోపక్క నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయారు. అలాంటి ఈయన ఇప్పుడు తన రెమ్యూనరేషన్ డబుల్ చేసిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రెమ్యునరేషన్ పెంచిన కిరణ్..

అసలు విషయంలోకి.. వెళ్తే తాజాగా సినీ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం తన రెమ్యూనరేషన్ పెంచేశారు అనే టాక్ గట్టిగా నడుస్తోంది ప్రస్తుతం సినిమాకు ఐదు కోట్లు అడుగుతున్నారని.. మొన్నటి వరకు 3 కోట్లు తీసుకున్న ఈయన.. ఇప్పుడు ఏకంగా 5 కోట్లు అడుగుతున్నాడని, పలువురు నిర్మాతలు కూడా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం సినిమా బడ్జెట్ కూడా కాస్త పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంపై నిర్మాత ఎస్కేఎన్ కూడా మాట్లాడుతూ..” కిరణ్ నుంచి రాబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఉన్నప్పుడే ఇవ్వండి లేదా ప్రాఫిట్స్ వచ్చాక ఇవ్వండి అని చెప్పాడు అంటూ ఎస్కేఎన్ తెలిపిన విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ యంగ్ హీరో ఇప్పుడు తన మార్కెట్కు తగ్గట్టుగా డిమాండ్ చేస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కిరణ్ అబ్బవరం సినిమాలు..

Advertisement

ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన.. మరొకవైపు సుకుమార్ నిర్మాణంలో ఒక సినిమా, అమెజాన్ కి ఒక వెబ్ సిరీస్, అలాగే బాలీవుడ్ కి ఒక సినిమాతో పాటు తన సొంత డైరెక్షన్ లోనే ఒక సినిమా కూడా ఉంది. ఇలా ఆల్మోస్ట్ అరడజనుకు పైగా సినిమాలను లైన్లో పెట్టారు కిరణ్ అబ్బవరం. ఇక వరుస ఫ్లాప్ లు ఇస్తున్న మీడియం రేంజ్ హీరోలే 7 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు. అలాంటిది వరుస హిట్లతో దూసుకుపోతున్న కిరణ్ 5 కోట్లు అడగడంలో తప్పులేదు అని అటు అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే కిరణ్ అబ్బవరం మరొకవైపు తన వరస చిత్రాలతో పాటు రెమ్యూనరేషన్ తో కూడా వార్తల్లో నిలిచారు.

ALSO READ:Salman Khan: హాస్పిటల్లో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి.. అసలేమైందంటే?

కిరణ్ అబ్బవరం కెరియర్..

Advertisement

కిరణ్ అబ్బవరం 2019లో ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1990 జూలై 15న కడప జిల్లా రాయచోటి మండలం లోని పెద్ద కోడి వాండ్ల పల్లిలో జన్మించారు. ఇక తన మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన రహస్య ఘోరక్ తో 2024 మార్చి 13న నిశ్చితార్థం జరిగి అదే ఏడాది వివాహం చేసుకున్నారు. ఇక 2025లో ఒక కుమారుడికి జన్మనిచ్చారు . ఇంకా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×