BigTV English

Jigris: కిరణ్ అబ్బవరం వదిలిన పాట విన్నారా.. చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే

Jigris: కిరణ్ అబ్బవరం వదిలిన పాట విన్నారా.. చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే

Jigris: ప్రస్తుతం టాలీవుడ్ లో.. అయితే పీరియాడిక్ కథలు.. లేకపోతే హర్రర్ కథలు.. ఈ రెండు కాకపోతే  ఫ్రెండ్స్ కథలు హిట్ అవుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్ లాంటి సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. తాజాగా ఆ లిస్ట్ లోకే చేరుతుంది జిగ్రీస్ మూవీ. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  జిగ్రీస్ చిత్రాన్ని హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక ఇటీవల  సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదలైన జిగ్రీస్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అంతేకాకుండా రికార్డ్ స్థాయి వ్యూస్ ను కూడా రాబట్టాయి. టీజర్ తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు స్టార్స్ అందరూ సపోర్ట్ గా నిలబడ్డారు. తాజాగా కిరణ్ అబ్బవరం జిగ్రీస్ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

ప్రస్తుతం కిరణ్.. K ర్యాంప్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అయినా సరే చిన్న చిత్రానికి అండగా నిలబడాలని షూటింగ్ కు పక్కన పెట్టి జిగ్రీస్ సాంగ్ ను రిలీజ్ చేశాడు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. ” నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే..  అందుకే కొత్త వాళ్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. జిగ్రీస్ టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.  జిగ్రీస్ టీమ్ కి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.


తిరిగే భూమి అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి కారులో ట్రిప్ కు వెళ్తున్నప్పుడు వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది. సాంగ్ మొత్తం చాలా మెలోడీగా సాగిపోయింది. డైరెక్టర్ హరీష్ రెడ్డినే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించాడు. ఇక కమ్రాన్ సయ్యద్ మ్యూజిక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్ కి ఈ సాంగ్ యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. కచ్చితంగా ఈ ఫ్రెండ్స్ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ కొత్త హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

SSMB 29: షూటింగ్ సెట్ ఫోటోలను లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. నమ్రత రియాక్షన్ చూసారా?

Sivakarthikeyan: ఆయనే నాకు స్ఫూర్తి సినీ ఎంట్రీ పై శివ కార్తికేయన్ కామెంట్స్!

Baaghi 4Trailer: రక్తంతో నిండిన ప్రేమ కథ…హై వోల్టేజ్ యాక్షన్ గా బాఘీ 4 ట్రైలర్!

Hero Darshan: హీరో దర్శన్ భార్యకు వేధింపులు.. అశ్లీల మెసేజ్లతో!

OG Movie: రికార్డులు ఓకే.. రేట్లు పెంచితేనే కష్టం

OG Bookings : ఓజీ సునామీ… రిలీజ్‌కు ముందే పుష్ప 2 రికార్డులు బ్రేక్

Big Stories

×