Nellore: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేసులో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని లేపేయాలని స్కెచ్ వేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్, లేడీడాన్ అరుణ.. కోటంరెడ్డి హత్యకు కుట్ర పన్నారు. దీనికి సంబంధించిన వీడియో పోలీసుల చేతికి దక్కింది. ఓ హోటల్‌లో తప్పతాగిన రౌడీషీటర్ శ్రీకాంత్ అనుచరులు.. మర్డర్ కుట్రను బయటపెట్టారు. వీడియోలో ఉన్న జగదీష్, వినీత్, మహేష్.. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బంటున్నాడు వినీత్. ఆ వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.
శ్రీధర్‌రెడ్డిని ఎలా చంపాలన్నదానిపై చర్చించుకున్న రౌడీలు
5 రోజుల క్రితం నెల్లూరులోని ఓ హోటల్‌లో రౌడీలంతా భేటీ అయ్యారు. శ్రీధర్‌రెడ్డిని ఎలా చంపాలన్నదానిపై చర్చించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బంటూ చెప్పుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అనుచరులను తమవైపు తిప్పుకోవాలని చూశారు అరుణ. కోటంరెడ్డిని హత్య చేస్తే గూడూరు గానీ,
సూళ్లూరుపేట టికెట్ గానీ ఇస్తామంటూ అరుణకు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
శ్రీకాంత్ పెరోల్ కోసం సంతకం పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
అసలు.. అరుణకు హామీ ఇచ్చిన లీడర్ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరోవైపు.. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డే సంతకం పెట్టారు. తమపై అనుమానం రాకూడదనే పెరోల్ డ్రామా ఆడారా? అందుకోసమే.. కోటంరెడ్డితో సంతకం పెట్టించారా? అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి.
ఆయన అనుచరులుగా ఉంటూనే.. ఆయన హత్యకే కుట్ర..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేసిన రౌడీలు.. గతంలో ఆయనతోనూ, ఆయన సోదరుడితోనూ దిగిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఆయన అనుచరులుగా ఉంటూనే.. ఆయన హత్యకే కుట్ర పన్నడం.. కలకలం రేపుతోంది. ముందునుంచే.. కోటంరెడ్డి హత్యకు కుట్ర చేసింది ఆయన అనుచరులేననే ప్రచారం జరిగింది. దానిని బలపరిచేలా.. వాళ్లతో దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు రావడం జిల్లాలో హాట్ టాపిక్‌గ మారింది.
Also Read: సుంకాలు చట్టవిరుద్ధం.. ట్రంప్‌కు దిమ్మతిరిగే దెబ్బ
కోటంరెడ్డి హత్యకు కుట్ర వీడియోపై నెల్లూరు ఎస్పీ స్పందన
కోటంరెడ్డి హత్యకు కుట్ర పన్నిన వీడియోపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఎమ్మెల్యేను చంపుతామన్న వీడియోపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ కుట్రకు సంబంధించి.. సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీ సూచించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రేపు మీడియా ముందుకు రానున్నారు. రౌడీషీటర్ల వీడియోపై ఆయన మాట్లాడనున్నారు.
కోటంరెడ్డి ఫస్ట్ రియాక్షన్..
ఈ హత్య కుట్ర కేసు గురించి కోటం రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో నన్ను చంపితే డబ్బే డబ్బు అన్న విషయం గురించి జిల్లా ఎస్పీకి మూడు రోజుల ముందు స్టేట్ మెంట్ వచ్చింది అని చెప్పారు.. కానీ దీని గురించి నాకు ఎందుకు చెప్పలేదు.. మీ గురించి ఇలా వీడియో వచ్చింది.. మీరు జాగ్రత్త చర్యలు తీసుకోండని చెప్పి ఉంటే బాగుండేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే రూరల్ ఎమ్మెల్యెను చంపితే డబ్బే డబ్బు అని అన్నారు కదా.. ఆ డబ్బు వారికి ఎవరు ఇస్తామని చెప్పారు.. ఇది పోలీసు విచారణలో తెలాల్సి ఉందని అని ఆయన తెలిపారు.. అంతేకాకుండా ఇలాంటి బెదిరింపులకు నేను కాదు కదా.. నా మనవడు, మనవరాలు కూడా బయపడరు అని తెల్చి చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సహంతో అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం.. చంద్రబాబు పేరిట సంక్షేమ పథకాలు పౌరులకు అందిస్తాం అని చెప్పారు. అంతేకాకుండా కష్ట్రంలో.. నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడం అని తెలిపారు. చివరి శ్వాస ఉన్నంతవరకు కూడా ప్రజాభివృద్ధిలో కొనసాగుతాం.. ఇలాంటి బెదిరింపులను లెక్కచేయం అని తెలియజేశారు.