Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఇటీవల వరుస సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు . అనంతరం ఈయన నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని ఒక కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కావడం అంటే మామూలు విషయం కాదు. కిరణ్ అబ్బవరం మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఇటీవల కిరణ్ అబ్బవరం కే రాంప్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే కిరణ్ అబ్బవరం తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యతో కలిసి ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన కిరణ్ అబ్బవరం ఫోర్ ఇయర్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ఎమోజిని షేర్ చేస్తూ.. అనంతరం అన్నా అంటూ లవ్ ఎమోజిని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు అభిమానులు ఏం జరిగింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
కిరణ్ అబ్బవరం తన అన్నయ్య పేరు రామాంజుల రెడ్డి(ramanjula Reddy). ఈయన 2021 వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. కడప జిల్లాలోని చెన్నూర్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో తన అన్నయ్య మరణించారు అయితే నేడు తన అన్నయ్య వర్ధంతి కావడంతో తన అన్నను గుర్తుచేసుకొని కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారని తెలుస్తోంది. చెన్నూర్ దగ్గర రాత్రి ప్రయాణం చేస్తున్న రామాంజుల రెడ్డి వాహనానికి గేదే అడ్డు రావడంతో గేదెను తగిలి డివైడర్ కు కొట్టుకొని మరణించారని తెలుస్తోంది. ఇలా తన అన్నయ్య అంటే ఎంతో ఇష్టపడే కిరణ్ అబ్బవరం తన అన్న మరణం గురించి ఈ పోస్ట్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
4 Years 💔.. Anna ❤️ pic.twitter.com/nuFGyfLeA9
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 1, 2025
ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ఈయన “రాజావారు రాణిగారు” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం ఇటీవల క, కే రాంప్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన క సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యను వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి హను అబ్బవరం అనే నామకరణం చేశారు.
Also Read: Samantha -Raj Nidimoru: భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ పెళ్లి..భూత శుద్ధి వివాహం అంటే ఏంటో తెలుసా!