E-Paper
Advertisement

Samantha -Raj Nidimoru: భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ పెళ్లి..భూత శుద్ధి వివాహం అంటే ఏంటో తెలుసా!

Samantha -Raj Nidimoru: భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ పెళ్లి..భూత శుద్ధి వివాహం అంటే ఏంటో తెలుసా!
Advertisement

Samantha -Raj Nidimoru: సినీనటి సమంత (Samantha)దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) నేడు ఉదయం కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లోని యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వివాహం జరుపుకున్నారు. ఇదివరకే సమంత తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అదేవిధంగా ఈషా ఫౌండేషన్ సైతం సమంత రాజ్ నిడిమోరు వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేశారు అయితే ఈ ఇద్దరు కోయంబత్తూర్ లోని లింగ బైరవి సన్నిధిలో పవిత్రమైన “భూతశుద్ధి వివాహం” (Bhuta Shuddhi Vivaha) చేసుకున్నట్లు వెల్లడించారు.

పురాతనమైన వివాహ ఆచారం..

ఇలా సమంత రాజ్ వివాహం “భూత శుద్ధి” పద్ధతిలో జరిగిందనే విషయం తెలియడంతో అసలు ఈ భూత శుద్ధి అంటే ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి భూత శుద్ధి అంటే ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..భూతశుద్ధి పద్ధతిలో వివాహం అన్ని ప్రాంతాలలోనూ జరగవని కేవలం కొన్ని నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే ఈ పద్ధతిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈషా ఫౌండేషన్ లో ఉన్నటువంటి లింగ బైరవి ఆలయంలో కూడా ఇదే పద్ధతిలో వివాహాలను జరిపిస్తారు. భూత శుద్ధి అంటే ఒక పురాతనమైన వివాహ ఆచారం. యోగ సాంప్రదాయం నుంచి ఈ ఆచారం వెలుగులోకి వచ్చింది.

భూత శుద్ధి అంటే పంచభూతాలు..

Advertisement

భూత శుద్ధి అంటే పంచభూతాలు (నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు). పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒకటి కావడమే ఈ భూత శుద్ధి వివాహం. ఈ ఆచార సాంప్రదాయాలలో భాగంగా పెళ్లి చేసుకోబోయే వధూవరుల దేహాలలోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. ఇలా వివాహం చేసుకోవడం వల్ల వివాహ బంధం ఎంతో పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మారుతుందని నమ్మకం. ఈ పద్ధతిలో వివాహం వధూవరుల శ్రేయస్సుకు అలాగే వారి దాంపత్య జీవితాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్మకం. ఈ భూత శుద్ధి వివాహంలో వధూవరులు ఈ యోగ ప్రక్రియను వివాహ వేడుకలో భాగంగా ఆచరిస్తారు కొన్ని సందర్భాలలో లింగ బైరవి వంటి దేవతల సన్నిధిలో ఇలాంటి వివాహాలను జరుపుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని భావిస్తారు.

Advertisement

ఇక ఈ భూత శుద్ధి వివాహం అనేది కూడా సాంప్రదాయ ఆచార వ్యవహారమే. భౌతికంగా ఆధ్యాత్మికంగా శ్రేయస్సు కోరుకునే వారికి ఇలాంటి వివాహాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది ఈ విధమైనటువంటి పద్ధతిలో వివాహాలను చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదివరకు హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్, గియో మానిక్ జంట కూడా ఇలా భూత శుద్ధి వివాహాన్ని జరుపుకున్నారు. అయితే ఈ పద్ధతిలో వివాహాలు అన్నిచోట్ల జరగవు కేవలం కొన్ని ప్రదేశాలలో మాత్రమే జరుగుతాయి. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ లో కూడా ఈ తరహా వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో సమంత రాజ్ సైతం ఈ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు.

Also Read: Samanth – Raj nidimoru wedding: ఇట్స్ అఫీషియల్.. రెండో పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×