E-Paper
Advertisement

Ind vs Sa 1st Odi : రాంచీ వన్డే కు అందమైన అమ్మాయి.. ఈమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Ind vs Sa 1st Odi : రాంచీ వన్డే కు అందమైన అమ్మాయి.. ఈమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Ind vs Sa 1st Odi : రాంచీ వేదిక‌గా టీమిండియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా మ‌ధ్య న‌వంబ‌ర్ 30, 2025న‌ తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 17 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ, టీమిండియా విజ‌యంతో పాటు సోష‌ల్ మీడియాలో ఓ అమ్మాయి కూడా వైర‌ల్ గా మారింది. ఆమె మరెవ్వ‌రో కాదండోయ్. రియావ‌ర్మ‌. ఆమెది ముంబై. ప్ర‌ముఖ యాంక‌ర్ కూడా. సౌతాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో స్టేడియంలో సంద‌డి చేసింది. ఈమె ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : Virat Kohli : విరాట్ కోహ్లీకి న‌డుము నొప్పులు..ఇలా అయితే 2027 వ‌న్డే క‌ప్ ఆడ‌టం క‌ష్ట‌మే ?

చిరున‌వ్వుతో షేక్ చేసిన మిస్ట‌రీ గ‌ర్ల్..!

ఈ అమ్మాయి చిరున‌వ్వు అభిమానుల హృద‌యాల‌ను ఉర్రూత‌లూగించ‌డ‌మే కాకుండా ఇంట‌ర్నెట్ ను షేక్ చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈమెకు సంబందించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో వెంట‌నే అభిమానులు ఈ అమ్మాయి గురించి సోష‌ల్ మీడియాలో సెర్చ్ చేయ‌డం ప్రారంభించారు. ఒక యూజ‌ర్ రియా వ‌ర్మ అనే పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ను క‌నుగొని ఈ అమ్మాయే అని ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి రియా వ‌ర్మ‌కు ఇన్ స్టా గ్రామ్ లో 2.5 మిలియ‌న్స్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈమె ఓ సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్. ప్ర‌స్తుతం చాలా మంది అభిమానులు ఈ మిస్ట‌రీ గ‌ర్ల్ గురించి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

టీమిండియా విజ‌యంలో విరాట్ కీల‌క పాత్ర‌..!

ఇక రాంచీలో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త క్రికెట్ జ‌ట్టు సౌతాఫ్రికా జ‌ట్టును 17 ప‌రుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 349 ప‌రుగులు చేసింది. 350 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు తొలుత 11 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోవ‌డంతో క‌చ్చితంగా ఓట‌మి పాల‌వుతుంద‌నుకున్న స‌మ‌యంలో జాన్సెన్, మాథ్యూ బ్రీట్జ్కే, కార్బిన్ బాష్ పోరాడిన‌ప్ప‌టికీ సౌతాఫ్రికా 17 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. తొలుత భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కానీ మిడిల్ ఓవ‌ర్ల‌లో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు రెచ్చిపోయారు. మ‌ళ్లీ చివ‌ర్లో భార‌త బౌల‌ర్లు పుంజుకోవ‌డంతో టీమిండియా విజ‌యం సాధించింది. లేదంటే టీమిండియా ఈ మ్యాచ్ లో ఓట‌మి పాల‌వుతుంద‌ని కూడా భావించారు. మ‌రోవైపు టీమిండియా కీల‌క ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కీల‌క పాత్ర పోషించాడు. 120 బంతుల్లో 135 ప‌రుగులు చేశాడు. దీంతో త‌న 52వ వ‌న్డే సెంచ‌రీని న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా త‌రపున విరాట్ కోహ్లీ 135, రోహిత్ 57, కే.ఎల్. రాహుల్ 60 హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఆల్ రౌండ‌ర్ జ‌డేజా కూడా 32 ప‌రుగులు చేశాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో మాథ్యూ బ్రీట్జ్కే72, జాన్సెన్ 70, బోస్ 67 ప‌రుగుల‌తో రాణించారు. చివ‌రి వ‌ర‌కు పోరాడి సౌతాఫ్రికా ఓట‌మి పాలైంది.

Also Read : KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 99% సక్సెస్ రేటు.. గిల్ దండగే, తొల‌గించాల‌ని డిమాండ్స్ !

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×