NEET Protest: గత కొంతకాలంగా మంటలు పుట్టిస్తున్న ‘నీట్’ (NEET) వ్యవహారం ఇపుడు మరింత ముదురుతుంది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) జూన్ 28న ఈ నిరసనను ప్రారంభించిన సంగతి తెల్సిందే.
ఇప్పటికే లక్షలాది స్టూడెంట్స్ భవిష్యత్ తో ఆటలాడవద్దు అంటూ ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తుండగా దీనికి దేశవ్వ్యాప్తంగా ఎంతో మంది తమ సపోర్ట్ తెలియచేస్తున్నారు కూడా .ఇక వీరికి తాజాగా సినీ రంగం నుండి మద్దతు లభిస్తుండటం ఇక్కడ విశేషం.
తన సపోర్ట్ తెలిపిన ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావ్
ఈ క్రమంలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించగా తాజాగా నేను కూడా అంటూ తన సపోర్ట్ తెలిపింది ఈ ఉద్యమానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావ్. సర్కార్ వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ నిరసన చేస్తున్న వాళ్ళతో చర్చ లని మొదలెట్టాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌ను “ఐ సపోర్ట్ సోనమ్” గ్రాఫిక్‌గా మార్చి తన నిరసనను వ్యక్తం చేసింది.సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దీప్కే, సీజేపీ..ఇలా విద్యార్థుల పట్ల సంఘీభావం తెలుపుతున్న వారందరికీ తన మద్దతు ఉంటుదని, తెలిపింది.
దేశం ఎప్పుడూ రుణ పడి ఉంటుంది
అంతేకాదు,సోనమ్ జీ, నేహా, మనీష్, అమీన్‌లు ..ఇలా ఏంటో మంది తమ ప్రాణాలని ఏ మాత్రం లెక్క చేయకుండా విద్యార్థులకి న్యాయం జరగాలని పోరాడుతున్నారని,వారందరికీ నా సలాంలు అంటూ ఆకాశానికి ఎత్తేసింది.అంతే కాదు సమాజంలో పాతుకుపోయి ఉన్న నిరాసక్తతను పారదోలేలా చేస్తూ ప్రతీ ఒక్కరు గొంతు ఎత్తాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి దేశం ఎప్పుడూ రుణ పడి ఉంటుందని పేర్కొంది.
also read:దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!
ఇప్పటికే వారు నిరాహార దీక్ష చేయడం మొదలై 19 రోజులు అవుతున్నా సర్కార్ అసలేమాత్రం రియాక్ట్ దారుణం అంటూ ఎకిపారేసింది.సర్కార్ సాధారణ ప్రజల మాట వినాలంటే ఇంకేం జరగాలని, ఇప్పటికైనా మొండి పట్టు వదిలి వారితో చర్చలకి శ్రీకారం చుట్టాలని కుండ బద్దలు కొట్టింది.ఇకనైనా వారి బాధ విని వారికి వ్యాయం చేయాలని,దీంతో ఈ దీక్షకి ముగింపు పలకాలని స్పష్టం చేసింది.
ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా కి ఆహ్వానిస్తుందో లేదో
కిరణ్ రావు విషయానికి వస్తే 1973 నవంబరు 7న తెలంగాణాలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు కుమారుడికి జన్మించిన కిరణ్ కలకత్తాలో పెరిగింది.1992లో ఆమె తల్లిదండ్రులతో పాటు ముంబైకు వెళ్ళిన ఈమె 1995లో ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.దర్శకత్వ విభాగంలోకి అడుగుపెట్టిన కిరణ్ రావ్ 2023లో లాపతా లేడీస్ కి 97వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కోసం ఇండియా తరపున ఎంట్రీని దక్కించుకోవడం విశేషం.ఇక ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కి కిరణ్ రావ్ మాజీ భార్య కూడా.
చూడాలి మరి ..ఇప్పటికే దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న ఈ ఇష్యూకి కిరణ్ రావు వంటి ప్రముఖ సెలబ్రిటీల మద్దతు ఏమైనా కలిసి వస్తుందో, సర్కార్ ఏమైనా దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా కి ఆహ్వానిస్తుందో !