E-Paper
Advertisement

యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్

యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్
Advertisement

Historical Action Movie: రక్తం ఏరులై పారడం అనే మాటను వినే ఉంటారు. కానీ రక్తం ఎడారిలో పారడాన్ని ఎప్పుడైనా చూశారా ? ఒకవేళ చూడకపోతే ఈరోజే ఓటీటీలోకి వచ్చిన ‘డిసర్ట్ వారియర్’ (Desert Warrior) మూవీని చూడాల్సిందే. ఒక భయంకర యుద్ధం, యువరాణి చేసిన త్యాగం, లెజెండరీ బందిపోటు సాహసం… వంటి అంశాలన్నీ కలిపి సృష్టించిన భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ ఎపిక్ డ్రామా ఈ మూవీ. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ వార్ డ్రామా 7వ శతాబ్దపు అరేబియా ఎడారుల నేపథ్యంలో నడుస్తుంది. క్రూరమైన పర్షియన్ చక్రవర్తి కిస్రాతో కథ స్టార్ట్ అవుతుంది. అరేబియా యువరాణి హింద్ ను అతను తన ఉంపుడుగత్తెగా ఉండమని ఆదేశిస్తాడు. కానీ గౌరవం, స్వేచ్ఛ కోసం యువరాణి హింద్ ఆ ఆదేశాన్ని తిరస్కరిస్తుంది. తన తండ్రితో కలిసి ఆమె ప్రాణాలను రక్షించుకోవడానికి విశాలమైన అరేబియా ఎడారిలోకి పారిపోతుంది.

Advertisement

ఈ ఊహించని ధిక్కారంతో చక్రవర్తి కిస్రా కోపంతో రగిలిపోతాడు. తన క్రూరమైన సైన్యాన్ని, అత్యంత ప్రమాదకరమైన కిరాయి హంతకులను ఎడారిలోకి పంపి వాళ్ళను తీసుకురమ్మంటాడు. ఇసుకలో దాక్కున్న ఆ శత్రువుల నుంచి తప్పించుకోవడం ఎవ్వరికైనా అసాధ్యం. అలాగే యువరాణికి కూడా కష్టం అవుతుంది. ఇక ప్రాణాలు పోవడమే నెక్స్ట్ అనుకుంటున్న టైమ్ లో లెజెండరీ బందిపోటు హంజ్ లా ఎంట్రీ ఇస్తాడు.

అతనికి ఎడారి అంతా కొట్టిన పిండి. అంతేకాదు ఆ బంధిపోతూ మంచి యోధుడు కూడా. ఇక్కడి నుంచి యువరాణి హింద్ క్రమంగా ఒక రాజకుమారి నుంచి వీరనారిగా టర్న్ తీసుకుంటుంది. ఎడారిలోని వివిధ తెగలను ఏకం చేసి, తన స్వేచ్ఛ, గౌరవం కోసం చక్రవర్తి సైన్యంతో ఘోర యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈ యుద్ధం అరేబియా చరిత్రలోనే ఒక మైలురాయి అయిన ‘ధీ ఖార్ యుద్ధం’ ఆధారంగా సాగుతుంది. మరి చివరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ? యువరాణి ఆ రాజుని ఏం చేసింది ? అన్నది స్టోరీ.

1400 కోట్ల డిజాస్టర్

Advertisement

‘డిసర్ట్ వారియర్’ సుమారు 1400 కోట్ల ఖర్చుతో సౌదీ అరేబియాలో నిర్మించిన సినిమా. ఇదే ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. భారీ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలతో అదరహో అనిపించింది. కానీ కథలోని బలహీనతల వల్ల బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఎడారి ల్యాండ్‌స్కేప్స్, యుద్ధ సన్నివేశాలు, కాస్ట్యూమ్ డిజైన్ అన్నీ టాప్ లెవల్. కానీ కథలోని గందరగోళం, కొన్ని బలహీనమైన స్క్రీన్‌ప్లే ఎలిమెంట్స్ వల్ల మూవీ పెద్దగా ఆడలేదు. ఇక ఈ సినిమా ఈరోజు నుంచే Amazon Prime Video, Lionsgate Playలో ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. ఈ విజువల్ ట్రీట్ తెలుగు డబ్బింగ్ మాత్రం అందుబాటులో లేదు.

Read Also: సూర్యరశ్మి పడితే వీళ్ళకి చావే… శృతి హాసన్ ఫేవరెట్ హర్రర్ మూవీ

Related News

అల్లరి అసుర పిల్లల రచ్చ… కిడ్స్ తో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ సిరీస్

బతికుండగానే చనిపోయిందని షాక్… డిజిటల్ ట్రాన్సాక్షన్ లో దిమ్మతిరిగే ట్విస్ట్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ చిత్రాలు .. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!

గేమ్ బోర్డులో మంత్రగత్తె ప్రాణాలు… రాత్రిపూట ఒంటరిగా చూసే సాహసం చేయకండి

నలుగురు అబ్బాయిలతో ఒకేసారి… కామెడీతో పాటు యూత్ కనెక్టయ్యే కొరియన్ సిరీస్

సైకో డాక్టర్ ప్రయోగంతో చచ్చే అమ్మాయి… మెంటలెక్కించే రివేంజ్ మర్డర్ మిస్టరీ

టైమ్ పాస్ కోసం అమ్మాయిలతో ఆడుకునే ప్లేబాయ్… కట్ చేస్తే గుండె జారిపోయే ట్విస్ట్

Big Stories

Advertisement
×