E-Paper
Advertisement

దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!

దిల్ రాజు పంచాయితీ వర్కవుట్ కాలేదా? డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ముదురుతున్న రచ్చ!
Advertisement

Dancers Controversy: ఎండ్ కార్డ్ పడిందనుకున్న టాలీవుడ్ డాన్సర్స్ పంచాయితీ చిలికి చిలికి సీరియల్ లా సాగుతూనే ఉంది.మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాడు ,ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయింది,దిల్ రాజు రంగంలోకి దిగబోతున్నాడు.ఇంకేం కొన్ని రోజులుగా జానీ vs శేఖర్ మాస్టర్ల మధ్య డాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న అంతర్యుద్దానికి ఇక ముగింపు పక్కా అనుకున్నారు అంతా.కాని లేటెస్ట్ గా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షురాలు వదిలిన లేఖతో ఈ వివాదం ముదిరినట్టే కనిపిస్తుంది.

ఉప ఎన్నికల్ని నిర్వహిస్తున్నామన్న సుమలత

Advertisement

అసోసియేషన్ లో ఖాళీగా ఉన్న పోస్ట్ లని నింపడానికి ఉప ఎన్నికల్ని నిర్వహిస్తున్నామంటూ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత ఒక లేఖ విడుదల చేసింది.ఇప్పుడు ఈ లేఖనే ఈ వివాదానికి మరింత మరింత మంటలని అంటించింది. అసలు అసోసియేషన్ బైలాస్ ని ఎక్కడా తప్పలేదని, ప్రస్తుతం అమలులులో ఉన్న చట్టాలకి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని ఆమె గట్టిగా సమర్థించుకుంటు లేఖలో ప్రస్తావించింది.

also read :గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

Advertisement

సభ్యులు ఏమన్నారంటే

ఇక షెడ్యూల్ ప్రకారం జూలై 20న నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుందని,అదే రోజు వాటిని పరిశీలిస్తామని,నామినేషన్లని ఉపసంహరించేందుకు జూలై 22న చివరి తేదీ అని ఈ లేఖలో చెప్పుకొచ్చింది.ఇక జూలై 26న పోలింగ్ ఉంటుందని, అదే రోజున రిజల్ట్ వస్తుందని తెలిపింది.కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా మీకు మీరుగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాజీనామా చేసిన డాన్సర్లు ఆ ఎన్నికలకి అడ్డం పడుతున్నారు.అసలు ఎన్నికలు జరగాల్సింది ఇలా కాదని, ఇలా కొన్ని పదవులకే ఎన్నికలు పెడితే సమస్య తీరదని,మొత్తం అసోసియేషన్ బాడీని రద్దు చేసి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కి వెళ్ళాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఫెడరేషన్ కి  ఎలక్షన్స్ కి ఏం సంబంధం 

ఇక ఇష్యూ లో మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే సుమలత సొంత నిర్ణయాలు తీసుకుంటూ వన్ సైడ్ గా ఎలక్షన్స్ చేస్తుందని.ఇండస్ట్రీలో ఉన్న పెద్దల మాటని కూడా లెక్కచేయకుండా ముందుకు పోతుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.తాజాగా దిల్ రాజు మరియు ఫెడరేషన్ కూడా ఎంటర్ అయి రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పినప్పటికీ,వారి నిర్ణయాన్ని లెక్కచేయకుండా ,అసలు ఫెడరేషన్ కి డాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న ఎలక్షన్స్ కి ఏం సంబంధమని సుమలత వాదిస్తున్నది ఆరోపిస్తున్నారు కొందరు డ్యాన్సర్లు.

ఒకవైపు అసోసియేషన్ బైలాస్ ప్రకారమే పోతున్నామని సుమలత, మరో వైపు మెజారిటీ సభ్యుల సెంటిమెంట్‌ను గౌరవించాలని మరొకొందరు చేస్తున్న డిమాండ్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.మొత్తానికి ఫిలిం ఫెడరేషన్ ఎలాంటి నిరయం తీసుకుంటుందో దాని ప్రకారమే ముందుకు వెళ్తామని అంటున్నారు సభ్యులు. చూడాలి చెప్పిన జూలై 20 నాటికి నామినేషన్ల ప్రక్రియ ఎలా ప్రారంభం అవుతుందో,ఎన్ని మలుపులు తీసుకుంటుందో !

also read :ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

Related News

మౌనీరాయ్ తో డేటింగ్.. అసలు నిజం బయటపెట్టిన అర్జున్!

గణిత మేధావి రామానుజన్‌కు ప్రీతి ముకుందన్ ఏమవుతుందో తెలుసా ?

ఒక్క హిట్ పడితే రేట్లు ఆకాశానికి.. ‘జైలర్ 2’ బేరసారాలపై ఇండస్ట్రీలో సెటైర్లు!

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

Big Stories

Advertisement
×