E-Paper
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠిని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్…కేసు కూడా పెట్టాడంటూ!

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠిని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్…కేసు కూడా పెట్టాడంటూ!
Advertisement

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య ప్రస్తుతం మెగా కోడలిగా చలామణి అవుతున్నారు. ఈమె నటుడు వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లిగా కూడా ప్రమోట్ అయ్యారు. ఇక లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు కానీ ఈమె పెళ్లయిన తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సతీ లీలావతి (Sathi Keelavathi)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

మెగా కోడలు సతీలీలావతి..

ఈ సినిమా మార్చి 6 వ తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా లావణ్య తన కెరియర్ అలాగే పర్సనల్ విషయాలను కూడా తెలియజేశారు. కొంతమంది అభిమానులతో కలిసి ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు ఇందులో భాగంగా ఒక అభిమాని మీరు ఎప్పుడైనా బాగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్న ఎదురవడంతో లావణ్య సంచలన విషయాలను బయటపెట్టారు.

ఆ డైరెక్టర్ తో సినిమా.. ఇబ్బంది పడ్డాను..

Advertisement

తాను ఢిల్లీలో ఉండి చదువుకునేదాన్ని అక్కడ ఏదైనా సమస్య వస్తే మా పేరెంట్స్ కి చెప్పేదాన్ని కాదు బాగా ఏడ్చేదాన్ని ఒకవేళ వారికి చెప్తే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చెప్పేదాన్ని కాదని తెలిపారు అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమిళంలో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఒక డైరెక్టర్ తనని ఇబ్బంది పెట్టారని లావణ్య త్రిపాఠి తెలిపారు. డైరెక్టర్ సినిమాకు తాను మొదట ఒకే చెప్పాను కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. అందుకే సినిమాలో నటించనని చెప్పాను దీంతో ఆయన నాపై కేసు పెట్టారు. అప్పుడు నా గురించి ఎన్నో వార్తలు కూడా బయటకు వచ్చాయి.

ఏడవడం కూడా చాలా మంచిది..

Advertisement

ఈ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక  ఇంటికి వెళ్లి బాగా ఏడ్చానని లావణ్య త్రిపాఠి తెలియజేశారు. అలా కాసేపు ఏడ్చిన తర్వాత ఒక కప్పు టీ తాగి చిల్ అయ్యానని, అప్పుడప్పుడు అలా ఏడవడం కూడా మంచిదే అంటూ లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఏ సినిమా సమయంలో ఇది జరిగింది? ఈమెను ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం లావణ్య బయట పెట్టలేదు. ఇలా డైరెక్టర్ కారణంగా ఇబ్బందులు పడ్డాననే విషయాన్ని తెలియజేయడంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Arjun Kalyan: బిబి జోడి 2 పై అర్జున్ కళ్యాణ్  కామెంట్స్..అంత వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×