E-Paper
Advertisement

Tata Sierra Test Drive Crash: టాటా సియెర్రా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన మహిళ.. నేరుగా 20 అడుగుల గుంతలోకి జంప్!

Tata Sierra Test Drive Crash: టాటా సియెర్రా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన మహిళ.. నేరుగా 20 అడుగుల గుంతలోకి జంప్!
Advertisement

Tata Sierra Test Drive Accident in Thane: సేఫ్టీ ఫీచర్లలో టాటా కార్లను మించిన కార్లు లేవని మరోసారి నిరూపణ అయ్యింది. కారు ఎగిరి ఏకంగా 20 ఫీట్ల లోతున్న గొయ్యిలో పడ్డా, కారులోని వాళ్లు ప్రాణాలు కోల్పోలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

టాటా సియెర్రాను టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్లిన మహిళ

మహారాష్ట్రలోని థానేకు చెందిన ఓ మహిళ టాటా సియెర్రా SUVని కొనాలనుకుంది. కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంది. తన బంధువుతో కలిసి షోరూమ్ కు వెళ్లింది. టెస్ట్ డ్రైవ్ కు వెళ్దామని చెప్పింది. సరే అన్నారు. ఆ కారు నడుపుతుండగా, తన బంధువు, షోరూమ్ పర్సన్ కారులో కూర్చున్నారు. కొంతదూరం వెళ్లగానే టెస్ట్ డ్రైవ్ చేస్తున్న మహిళ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా నిర్మాణంలో ఉన్న ఒక గొయ్యిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడినప్పటికీ, ప్రాణాలతో బయటపడ్డారు.

రోడ్డు మీద నిలిపి ఉంచుని వాహనాలు ధ్వంసం

Advertisement

థానే వెస్ట్ లోని పంచ్‌పఖాడి ప్రాంతంలో ఉన్న ఒక షోరూమ్ నుంచి ఈ టాటా సియెర్రా కారును తీసుకెళ్తారు. వేగంగా డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆమె నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగే ముందు కారు రహదారి మీద ఉన్న ఒక ఆటోరిక్షా, రెండు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. ఆ తర్వాత రహదారి పక్కన ఏర్పాటు చేసిన బారికేడ్ల మీదుగా దూసుకెళ్తూ, సమీపంలో నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఉన్న గొయ్యిలోకి పడిపోయింది. ఆ సమయంలో కారులో మహిళతో పాటు ఆమె బంధువు, షోరూమ్‌కు చెందిన ఒక ఉద్యోగి ఉన్నారు.

ప్రాణాలు కాపాడిన సేఫ్టీ ఫీచర్లు

యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురినీ రక్షించారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టాటా సియెర్రాలోని భద్రతా వ్యవస్థలు ప్రయాణికులను రక్షించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. భారత్ NCAP 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ SUVలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్-2 ADAS, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి పలు అత్యాధునిక  భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ లు వెంటనే తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్రమైన గాయాల నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కారు దాదాపు 20 అడుగుల లోతు ఉన్న గొయ్యిలో పడిపోయినప్పటికీ వాహనం పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండటం దాని హై స్ట్రెంగ్త్ స్టీల్ బాడీని ఎంత గట్టిగా ఉంటుందో సూచిస్తుంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో భలే బాగా టెస్ట్ డ్రైవ్ చేసిందంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

టాటా సియెర్రా గురించి..

Advertisement

ప్రస్తుతం, టాటా సియెర్రా ధర రూ. 11.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది 160hp పవర్, 255Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ 4 సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ తో వస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో ఉంటుంది. సియెర్రా డీజిల్ వేరియంట్ 118hp 1.5 లీటర్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్స్ లో లభిస్తుంది.

Read Alos: చిన్నారులను కారు సన్‌రూఫ్‌లో నిలబెట్టినా, హెల్మెట్ లేకుండా బైకుపై తీసుకెళ్లినా భారీ జరిమానా, ఎంతంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×