E-Paper
Advertisement

Manirathnam: ఆస్కార్ విజేతకు మణి ‘షాక్’.. అసలు కారణం ఇదేనా!

Manirathnam: ఆస్కార్ విజేతకు మణి ‘షాక్’.. అసలు కారణం ఇదేనా!
Advertisement

Manirathnam: అది 1992.. ‘చిన్న చిన్న ఆశ’ అంటూ ఒక కుర్రాడు తన సంగీతంతో దేశాన్ని ఉర్రూతలూగించాడు. ఆ కుర్రాడిని పరిచయం చేసిన దార్శనికుడు మణిరత్నం. అప్పటి నుంచి మొన్నటి ‘పొన్నియిన్ సెల్వన్’ వరకు మణిరత్నం దృశ్యానికి, రెహమాన్ శబ్దం తోడవ్వాల్సిందే. కానీ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం.. మణిరత్నం తన తర్వాతి ప్రాజెక్ట్ నుంచి రెహమాన్ ను పక్కన పెట్టి ఒక యువ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారట.

ఇళయరాజా టు రెహమాన్.. ఇప్పుడు ‘సాయి అభ్యంకర్’
మణిరత్నం ఎప్పుడూ తన సంగీత దర్శకులను మార్చడానికి ఇష్టపడరు. కెరీర్ మొదట్లో ఇళయరాజాతో వరుసగా 10 సినిమాలు చేసిన మణి, ఆ తర్వాత రెహమాన్ తో ఏకంగా 34 ఏళ్ల పాటు ప్రయాణించారు.రెహమాన్ స్థానంలో ఇప్పుడు మణిరత్నం ఎంచుకున్నది సాయి అభ్యంకర్ (Sai Abhyankar) ను. ఈ కుర్రాడు ఎవరో కాదు.. ప్రముఖ గాయకుడు టిప్పూ, హరిణిల కుమారుడు.మణిరత్నం తన తర్వాతి సినిమాను పూర్తిగా నేటి తరం యువతను ఆకట్టుకునేలా ‘అర్బన్ లవ్ స్టోరీ’గా ప్లాన్ చేస్తున్నారు. దీనికి రెహమాన్ క్లాసిక్ టచ్ కంటే.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘సాయి అభ్యంకర్’ మార్క్ వైబ్స్ కావాలని మణి ఫిక్స్ అయ్యారట.

Advertisement

విజయ్ సేతుపతి – సాయి పల్లవి.. వెండితెరపై ‘నేచురల్’ మ్యాజిక్
ఈ సినిమా కేవలం మ్యూజిక్ పరంగానే కాదు, కాస్టింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోందని కోలీవుడ్ టాక్ .మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి ఇది రెండో సినిమా. ‘చెక్క చివంత వానం’లో తన నటనతో మణిని మెప్పించిన విజయ్, ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీలో మెరవబోతున్నారు.
మణిరత్నంకు సాయి పల్లవి అంటే విపరీతమైన ఇష్టం. గతంలో ‘కాట్రు వెలియిడై’ (చెలియా) కోసం ఆమెను అనుకున్నారు కానీ కుదరలేదు. ఎట్టకేలకు సాయి పల్లవిలోని ‘నేచురల్’ నటిని తన కెమెరాలో బంధించేందుకు సిద్ధమయ్యారు మణి.

34 ఏళ్ల సెంటిమెంట్ కంటే ‘క్రియేటివిటీ’కే మొగ్గు
రెహమాన్ లేని మణిరత్నం సినిమాను ఊహించడం కష్టం. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎందరికో రింగ్‌టోన్లు కూడా.అయితే ‘రోజా’ సమయంలో అప్పటి స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఒక కొత్త కుర్రాడిని (రెహమాన్) ఎలాగైతే నమ్మారో.. ఇప్పుడు సాయి అభ్యంకర్ ను కూడా అలాగే నమ్ముతున్నారని టాక్.ఏది ఏమైనా రెహమాన్ లేని మణిరత్నం సినిమా అంటే అది ఒక ప్రయోగమే. అయితే మణిరత్నం లాంటి లెజెండ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుందన్నాయ్ కోలీవుడ్ సర్కిల్స్.మరి రెహమాన్ ‘మెలోడీ’కి అలవాటు పడ్డ ప్రేక్షకులు.. ఈ ‘కుర్రాడి’ మ్యూజిక్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

Advertisement

also read: బిగ్ సినిమా ఫటాఫట్..సెన్సేషనల్ అప్‌డేట్స్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×