E-Paper
Advertisement

Konidela Surekha: మెగా ఫ్యామిలీని నేను మేనేజ్ చేస్తాను అనుకుంటారు.. కానీ నిజం ఏమిటంటే.. సురేఖ కీలక వ్యాఖ్యలు

Konidela Surekha: మెగా ఫ్యామిలీని నేను మేనేజ్ చేస్తాను అనుకుంటారు.. కానీ నిజం ఏమిటంటే.. సురేఖ కీలక వ్యాఖ్యలు
Advertisement

Konidela Surekha: మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె చిరంజీవి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచారు. చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, ఆ ప్రయాణంలో ఆయనకు బలమైన మద్దతుగా సురేఖ ఎప్పుడూ ఆయనతో పాటు నిలిచారు. కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ, చిరంజీవికి అండగా నిలుస్తూ ఆమె తన జీవితాన్ని ఎంతో సమతుల్యంగా కొనసాగించారు.

చిరంజీవికి భార్యగా మాత్రమే కాకుండా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు తల్లిగా కూడా సురేఖ అందరికీ తెలిసిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె మెగా కుటుంబంలో అమ్మమ్మగా కూడా కొత్త పాత్రను ఆనందంగా కొనసాగిస్తున్నారు. మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌లో అత్యంత ప్రభావం ఉన్న కుటుంబాలలో ఒకటి. అయినప్పటికీ సురేఖ మాత్రం ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు

Advertisement

మెగా ఫ్యామిలీ గురించి సురేఖ..!

ఇటీవల ఒక ఈవెంట్‌కు హాజరైన సురేఖ అక్కడ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎంతో సరళంగా తన కుటుంబ జీవితం గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. చాలా మంది మెగా ఫ్యామిలీని సురేఖ బాగా మేనేజ్ చేస్తారని భావిస్తుంటారు. దీనిపై ఆమె తన అభిప్రాయాన్ని చాలా / వ్యక్తం చేశారు.

Advertisement

ఆమె మాట్లాడుతూ “అందరు అనుకుంటారు నేను మెగా ఫ్యామిలీని బాగా మేనేజ్ చేస్తానని…” అన్నారు. అయితే తాను అలాంటి భావనతో ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. కుటుంబంలో తన బాధ్యతలను నిజాయితీగా చేయడం మాత్రమే తనకు ముఖ్యమని తెలిపారు.

ఆమె మాట్లాడుతూ “నేను చేసే పని నిజాయితీగా, Selfless గా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా చేస్తే చాలు అనిపిస్తుంది…” అని అన్నారు. తనకు ఎలాంటి గుర్తింపు కావాలని కాదు, తన పని తాను నిజాయితీగా చేయడం చాలు అని చెప్పారు.

తన జీవితంలో ఉన్న పాత్రల గురించి కూడా సురేఖ వివరించారు. కుటుంబంలో ఒక భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, అత్తగా తాను తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఆమె మాట్లాడుతూ “ఒక భార్యగా.. అమ్మగా.. అమ్మమ్మగా… అత్తగా నా పని నేను చేస్తున్నాను అంతే!” అని చెప్పారు.
సురేఖ చెప్పిన ఈ మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి.

ALSO READ: Thalapathy Vijay: భార్యతో విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. ఏమన్నారంటే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×