E-Paper
Advertisement

Thalapathy Vijay: భార్యతో విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. ఏమన్నారంటే!

Thalapathy Vijay: భార్యతో విడాకులపై తొలిసారి స్పందించిన హీరో విజయ్.. ఏమన్నారంటే!
Advertisement

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం, అలాగే హీరోయిన్ త్రిషతో ఆయనకు సంబంధం ఉందనే రూమర్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తొలిసారి ఈ విషయాలపై పరోక్షంగా స్పందించడం ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

విడాకుల వార్తల గురించి ఏమన్నారంటే..!

ఇటీవల అభిమానులను ఉద్దేశించి విజయ్ ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో ఆయన తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల గురించి సంక్షిప్తంగా మాట్లాడారు. “ఇటీవల నన్ను చుట్టుముట్టిన కొన్ని సమస్యల గురించి మీరు బాధపడవద్దు. మీరు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోకండి. అవి మీ సమయానికి అంత విలువైనవి కావు. ఆ సమస్యలను నేను స్వయంగా చూసుకుంటాను. మనం ఇప్పుడు ప్రజల సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టాలి” అని అభిమానులకు తెలిపారు.

Advertisement

విజయ్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఆయన అభిమానులు ఈ సందేశాన్ని సానుకూలంగా స్వీకరించారు. తమ హీరో వ్యక్తిగత విషయాలపై స్పందించకుండా సమాజానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడం మంచి విషయం అని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఆమెతో అతను..!

ఇదిలా ఉండగా, ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ పెళ్లి వేడుకలో విజయ్ మరియు త్రిష కలిసి కనిపించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వేడుకకు ఇద్దరూ ఒకే కారులో రావడం, స్టేజ్‌పై కలిసి నిలబడి కొత్త దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రూమర్లు మరింత పెరిగాయి.

Advertisement

అయితే ఇప్పటివరకు విజయ్ లేదా త్రిష ఈ విషయాలపై ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఈ విషయాలపై వివిధ రకాల ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్.. త్రిష గతంలో కలిసి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. గిల్లీ, తిరుపాచ్చి, ఆతి, కురువి, లియో వంటి సినిమాల్లో ఈ జంట కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు విజయ్ ప్రస్తుతం తన కొత్త సినిమా జన నాయకన్ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్ సమస్యలు వెంటారడం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.

ALSO READ: Ustaad Bhagat Singh Trailer Tease: అది భగవద్గీత.. ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×