Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరవుతూ వారికి సంబంధించిన విషయాల గురించి అలాగే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుతూ ఎంతో అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది .ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ఒక విలన్ గానే పరిచయం అయ్యారు. క్రాక్ సినిమాలో ఈమె విలన్ పాత్రలో తన నటనతో అదరగొట్టారని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna)హీరోగా నటించిన వీర సింహారెడ్డి (Veera Simha Reddy)సినిమాలో కూడా ఈమె బాలయ్యకు చెల్లెలుగా, విలన్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారితో నటించడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు వరలక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వర్ష ప్రశ్నిస్తూ.. సాధారణంగా బాలయ్య గారిని చూస్తేనే చాలామంది వణికిపోతారు అలాంటిది మీరు ఆయనతో కలిసి నటించడమే కాకుండా ఏకంగా తనని కత్తి తీసుకొని పొడిచే సన్నివేశంలో కూడా నటించారు. మీకెలా అనిపిస్తోంది అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు వరలక్ష్మి సమాధానం చెబుతూ.. వామ్మో బాలకృష్ణ గారితో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ గారిని కత్తితో పొడిచి అలా తోసేయడం సీన్ గురించి డైరెక్టర్ గారు చెప్పడంతో నేను చేయనని చెప్పేశాను.నేను బాలకృష్ణ గారిని చంపే సీన్ చేస్తే ఆయన అభిమానులు నా ఇంటి పైకి దాడి చేసిన నన్ను కొడతారు.. వద్దు సార్ నేను చేయనని చెప్పాను.
ఆ సమయంలో బాలకృష్ణ గారు తన వద్దకు వచ్చి ఏం పర్వాలేదు చేసేయమ్మా అంటూ చాలా ఎంకరేజ్ చేశారని, నువ్వు చేస్తే కచ్చితంగా మన ఫ్యాన్స్ కి కూడా నచ్చుతుందని,ఈ సీన్ సిస్టర్ సెంటిమెంట్ కావడంతో బాగా పండుతుందని బాలకృష్ణ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ గారితో నటించడం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ కామెంట్స్ విన్న అభిమానులు పాపం బాలయ్య అభిమానులకు వరలక్ష్మి బాగా భయపడిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలుగా నటించి ఒక వైపు సెంటిమెంట్ పండిస్తూనే మరోవైపు విలన్ పాత్రలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టారని చెప్పాలి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం నటిగా దర్శకురాలిగా కూడా బిజీగా ఉన్నారు.
Also Read: Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ భారీ రెమ్యూనరేషన్..ఎంతంటే?