BigTV English

Kuberaa Day 2Collections : ధనుష్ – నాగార్జున ‘కుబేర ‘.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Kuberaa Day 2Collections : ధనుష్ – నాగార్జున ‘కుబేర ‘.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?

Kuberaa Day 2Collections : తమిళ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ రూపోందింది. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా మూవీని నిర్మించారు. రీసెంట్ గా థియేటర్లలోకి ఐదు భాషల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. దాంతో రెండో రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


‘కుబేర’ సెకండ్ డే కలెక్షన్స్.. 

కుబేర మూవీ పై మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. టీజర్స్, ట్రైలర్స్ ఈ మూవీ పై భారీ అంచనాలని క్రియేట్ చేశాయి. అదేవిధంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగానే వచ్చుంటాయని అందరూ అనుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు, నాలుగు రోజుల ముందు నుంచే ఓపెనింగ్స్ ప్రారంభం కాగా.. తమిళనాడులో మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో ముందు రోజు మాత్రమే బుకింగ్ ప్రారంభించారు. కొన్ని చోట్ల 60 శాతం ఆక్యుపెన్సి కూడా కాలేదని సమాచారం..  ఏది ఏమైనా కూడా ఈ మూవీ సెకండ్ డే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే12.4 కోట్లు వసూల్ చేసింది.. అలాగే రెండో రోజు కుబేర కలెక్షన్స్ పెరిగాయనే చెప్పాలి.. 21 కోట్లు వరల్డ్ వైడ్ గా వసూల్ చేసిందని టాక్.. ఈ వీకెండ్ మరి కాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. ఎలా ఉంటాయో చూడాలి..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

కుబేర బడ్జెట్..ఎంతంటే..? 

కుబేర మూవీ బడ్జెట్ విషయానికొస్తే.. గతంలో శేఖర్ కమ్ముల ఏ మూవీకి ఖర్చు చెయ్యని విధంగా దీనికి ఎక్కువగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. టాప్ టెక్నీషియన్లు వర్క్ చేయడం, రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఇక బిజినెస్ ను చూస్తే..రూ.65 కోట్ల బిజినెస్ జరగ్గా రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.. మిగిలిన స్టేట్స్, ఓవర్సీస్ కలిపి రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం రూ.60 కోట్ల వరకు ఇండియా షేర్, రూ.120 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది.. నాగార్జున ఖాతాలో ఈ మూవీ హిట్ పడింది. ఈ మూవీలో ధనుష్ పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మూవీకి మౌత్ టాక్ బాగానే ఉంది.. కలెక్షన్స్ అన్నీ ఏరియాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో టాక్.. చూడాలి ఏ రేంజ్ లో వసూళ్లు దక్కుతాయో..

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×