BigTV English

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్… మతిపోగొట్టే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్… మతిపోగొట్టే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడతారు. ఆ తరువాత స్టోరీ ట్విస్టులతో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్నింగ్’ (Burning). 2018లో విడుదలైన ఈ సినిమాకు లీ చాంగ్-డాంగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హరుకి మురాకామి 1983లో రాసిన ఒక చిన్న కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో యూ ఆహ్-ఇన్ (లీ జాంగ్-సూ), స్టీవెన్ యీన్ (బెన్), జియాన్ జాంగ్-సియో (షిన్ హే-మీ) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా 2018 మే 16న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. దీనికి IMDbలో 7.4/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లీ జాంగ్-సూ ఒక రచయితగా రచనలు చేస్తుంటాడు. అతను సియోల్‌లో ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్ వద్ద షిన్ హే-మీను కలుస్తాడు. ఆమె ఒక డాన్సర్‌గా పనిచేస్తోంది. హే-మీ, జాంగ్-సూ పొరుగు వాళ్ళు కావడంతో చిన్నతనంలో కలసి ఉండేవాళ్లు . మొదట హే-మీ అతన్ని గుర్తుచేస్తుంది. ఇక ఒకరినొకరు ముచ్చటించుకున్న తరువాత ఆమె అతన్ని తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానిస్తుంది. అక్కడ ఒకరినొకరు తెలుసుకుంటారు. అంతే కాకుండా ఆమె అతన్ని తన పిల్లి, బాయిల్ ను చూసుకోమని కోరుతుంది. ఎందుకంటే ఆమె ఆఫ్రికాలోని కెన్యా పర్యటనకు వెళ్తుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక రాత్రి ఏకాంతంగా కూడా గడుపుతారు. ఇక జాంగ్-సూ తన తండ్రి ఫామ్‌హౌస్‌లో జీవిస్తుంటాడు. అతని తండ్రి అధికారులతో గొడవ పడిన కేసులో జైలులో ఉన్నాడు. దీనివల్ల జాంగ్-సూ ఒంటరితనంతో బాధపడుతుంటాడు. ఇప్పుడు అతను హే-మీ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి బాయిల్‌ను చూసుకుంటాడు. కానీ పిల్లి ఎక్కడా కనిపించదు. ఆమె మీద అతనికి సందేహం కలుగుతుంది.  హే-మీ కెన్యా నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆమె బెన్ అనే ధనవంతుడుతో కలసి వస్తుంది.

ముగ్గురూ కలిసి ఇప్పుడు సమయం గడుపుతారు. కానీ జాంగ్-సూ, బెన్ పట్ల అనుమానంతో నిండిపోతాడు. ఒక సాయంత్రం వీళ్ళు జాంగ్-సూ ఫామ్‌హౌస్‌లో కలుస్తారు. అక్కడ హే-మీ ఒక పాంటోమైమ్ డాన్స్ చేస్తుంది. ఆమె ఆఫ్రికాలో నేర్చుకున్న “గ్రేట్ హంగర్” గురించి చెప్పుకొస్తుంది. ఇలా సమయం గడిపిన తరువాతహే-మీ ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది. ఆమె అపార్ట్‌మెంట్ ఖాళీగా కనిపిస్తుంది. ఆమె ఫోన్ కూడా డిస్‌కనెక్ట్ అవుతుంది. జాంగ్-సూ, ఆమె గురించి ఆందోళన చెందుతూ, ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె బాయ్‌ఫ్రెండ్ బెన్‌ను ట్రాక్ చేస్తాడు. ఇప్పుడు అతను ఒక కొత్త అమ్మాయితో కనిపిస్తాడు. హే-మీ గురించి రెక్లెస్ గా జవాబులు ఇస్తాడు. జాంగ్-సూకి బెన్‌ మీద అనుమానం వస్తుంది. హే-మీ ఆచూకీ కూడా తెలీకుండా పోతుంది. చివరికి హే-మీ ఏమౌతుంది ? ఆమెను బెన్ ఏమైనా చేశాడా ? బెన్ గతం ఏమిటి ? లీ జాంగ్ హే-మీని కనిపెడతాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : బ్యాచిలర్ పార్టీలో గందరగోళం… కామెడీతో కడుపుబ్బా నవ్వించే మలయాళ మూవీ

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×