E-Paper
Advertisement

తల్లి కాబోతున్న కుంభమేళా మోనాలిసా.. పెళ్లయిన నెలకే? ఇదేం ట్విస్ట్ అయ్యా!

తల్లి కాబోతున్న కుంభమేళా మోనాలిసా.. పెళ్లయిన నెలకే? ఇదేం ట్విస్ట్ అయ్యా!
Advertisement

Monalisa Bhosle: మోనాలిసా భోంస్లే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా వీడియోలు రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు. ఇలా మోనాలిసా(Monalisa) వీడియోలు వైరల్ గా మారడంతో ఈమెను ఏకంగా హీరోయిన్ ను చేసిన సంగతి తెలిసిందే. మోనాలిసా ప్రస్తుత బాలీవుడ్ సినిమాలతో పాటు మలయాళం తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు. మోనాలిసా హీరోయిన్గా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న తరుణంలోనే ఈమె జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి.

గుడ్ న్యూస్ చెప్పిన మోనాలిసా..

మోనాలిసా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినటువంటి ఫర్మాన్ ఖాన్ (Farman Khan)అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాననీ, తనను పెళ్లి చేసుకోవడానికి కుటుంబసభ్యులు అంగీకరించలేదని తమకు ప్రాణహాని ఉంది అంటూ కేరళ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మార్చి 11వ తేదీ కేరళలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్లి పై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. మోనాలిసా మైనర్ అని తన పెళ్లి చెల్లదు అంటూ తన తల్లిదండ్రులు పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు మోనాలిసాను హాజరు కావాలని తెలిపారు.

మోనాలిసా ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఫర్మాన్ ఖాన్…

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయంలో ఫర్మాన్ ఖాన్ మధ్యప్రదేశ్ పోలీసులతో మాట్లాడుతూ.. మోనాలిసా పై తన తల్లిదండ్రులు నమోదు చేసిన కేసు విషయం మోనాలిసా విచారణకు హాజరు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ విచారణ కోసం ప్రయాణం చేయలేదని ఫర్మాన్ ఖాన్ తెలియజేశారు. ఈ విధంగా మోనాలిసా ప్రెగ్నెంట్ కావడంతోనే కేసు విచారణకు హాజరు కాలేదని ఈయన తెలియజేయడంతో పోలీసులు అతను చెప్పిన మాటలు నిజమా కాదా అనే అంశంపై విచారణ చేపట్టబోతున్నట్లు సమాచారం.

పెళ్లయిన నెలకే ప్రెగ్నెంట్..

Advertisement

ఈ విధంగా మోనాలిసా తల్లి కాబోతుందనే విషయాన్ని ఆమె భర్త పోలీసుల వద్ద తెలియచేయడంతో ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే మోనాలిసా తల్లి కాబోతోందా? లేదంటే ఈ కేసు నుంచి బయటపడటం కోసమే అలా చెబుతున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె మార్చి 11వ తేదీ పెళ్లి చేసుకోవడంతో పెళ్లయిన నెలకి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయిన నెలకి ప్రెగ్నెంటా? మోనాలిసా పెళ్లి విషయంలో ఈ ట్విస్టులు ఏంటీ భయ్యా రోజుకొక షాకింగ్ న్యూస్ బయట పెడుతున్నారు అంటూ నెటిజన్స్ ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి మోనాలిసా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: బిగ్ బాస్ అశ్విని శ్రీ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న నటి!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×