E-Paper
Advertisement

పురాణాల వేటలో చందు మొండేటి.. బాలీవుడ్ కిలాడీతో భారీ స్కెచ్!

పురాణాల వేటలో చందు మొండేటి.. బాలీవుడ్ కిలాడీతో భారీ స్కెచ్!
Advertisement

Ujjayini Movie :మహావతార్ నరసింహ… యానిమేటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్ల పైచిలుకు వసూళ్లు కొల్లగొట్టడంతో అదే ఊపులో నాగ వంశీ నిర్మాతగా ‘వాయుపుత్ర’ అనే యానిమేటెడ్ మూవీకి శ్రీకారం చుట్టాడు చందు మొండేటి. కార్తికేయ 2 వంటి మైథలాజికల్ హిట్ కొట్టడం, తండేల్ వంటి సాలిడ్ సక్సెస్ చూడటంతో ఇక ఈ సినిమా కూడా ఈజీగానే కంప్లీట్ అవుతుంది అనుకున్నారు. కట్ చేస్తే బడ్జెట్ భారీగా డిమాండ్ చేయడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తక్కువ రేట్ కోట్ చేయడంతో ప్రాజెక్ట్‌నే పక్కన పెట్టేశాడట నాగ వంశీ.

ధర్మ ప్రొడక్షన్స్‌తో ‘ఉజ్జయిని’ అనే భారీ హిస్టారికల్

Advertisement

ఇక ఆ సినిమా అలా పక్కకి వెళ్ళిపోయిందో లేదో బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్‌తో ‘ఉజ్జయిని’ (వర్కింగ్ టైటిల్) అనే భారీ హిస్టారికల్ థ్రిల్లర్‌కు తెర తీశాడట చందు మొండేటి. ఇక కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్తో పాటు మన రానా దగ్గుబాటి కూడా కలిసి నటిస్తుండటం విశేషం.

ఇక గతంలో అక్షయ్ కుమార్, రానా కలిసి బాలీవుడ్ ‘బేబీ’లో నటించిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లే కాకుండా ఇందులో మరో స్టార్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ హిస్టారికల్ థ్రిల్లర్‌ను మరో క్రేజీ మల్టీస్టారర్‌గా తీర్చిదిద్దనున్నారన్న మాట.

Advertisement

వాయుపుత్రని టోటల్‌గా పక్కన పెట్టేశారా?

ఇక సినిమా కథ విషయానికి వస్తే పురాతన నగరం ఉజ్జయిని బ్యాక్‌డ్రాప్‌లో చరిత్ర, పురాణాలు, మిస్టరీలన్నిటిని కలగలుపుతూ ఎప్పుడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌గా తీర్చిదిద్దనున్నాడని సమాచారం. ఎలాగూ కార్తికేయ 2 వంటి మైథలాజికల్ సినిమా చేసిన అనుభవం ఉండటం ఈ సినిమాకి కలిసి వచ్చేదే.

అయితే అట్టహాసంగా అనౌన్స్ చేసిన వాయుపుత్రను టోటల్‌గా పక్కన పెట్టేశారా? లేక ఇదయ్యాక దాన్ని తెరమీదకి తీసుకువస్తారా? అన్నదానిపై దర్శక నిర్మాతల నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోవడం కాస్త ఆశ్చర్యమే.

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న సినిమా

ఇక ఒకవైపు “థియేటర్లే దేవాలయాలుగా మారేలా ‘వాయుపుత్ర’ను తీస్తామన్న చందు మొండేటి… ఇప్పుడు అక్షయ్ కుమార్తో ఉజ్జయిని మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారా?” అని కొందరు కామెంట్ చేస్తుంటే, ఇదైనా వాయుపుత్రలా బడ్జెట్‌కు భయపడి మధ్యలోనే ఆగిపోదు కదా అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా టాలీవుడ్‌లో సత్తా చాటిన చందు ఇప్పుడిలా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌తో ఈ రేంజ్ సినిమా తీయడం మెచ్చుకోతగ్గ విషయమే. చూడాలి మరి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు శ్రీకారం చుడుతుందో!

also read:పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ సీన్ రివర్స్ … ఈసారి తప్పించుకోలేరా?

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×