Jananayagan Film: విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం జననాయగన్(Jananayagan) హెచ్ .వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నటుడు విజయ్ (Vijay)కెరియర్ లోనే ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం అన్ని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ రాజకీయాలలోకి రావడంతో తన సినిమాలపై రాజకీయ కుట్రలో భాగంగా విడుదలను అడ్డుకున్నారు. సెన్సార్ సమస్యలను తలెత్తుతూ ఈ సినిమా విడుదల కాకుండా ఆపేశారు. ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. అయితే తమిళనాడులో ఎన్నికలు పూర్తి అనూహ్యంగా నటుడు విజయ్ ఎన్నికలలో గెలవడం, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం జరిగింది.
ఇలా హీరో పై కుట్రతో ఎవరైతే సినిమాని అడ్డుకున్నారో వారిని ఓడించి ప్రభుత్వాన్ని తన చేతుల్లో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే జననాయగన్ సినిమాకు ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. ఇలా విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా విడుదల కాకుండా ఉండడమే మంచి జరిగింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ నేడు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జన నాయగన్ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందని అభిమానులు కూడా భావించారు కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
ఇలా జననాయగన్ సినిమా విడుదల తేదీ గురించి సరైన స్పష్టత రాని నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చారు. కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత ఈ సినిమా విడుదల గురించి మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో ఆగేది లేదని తెలిపారు. నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ నటించిన ఈ సినిమా మరొక రెండు వారాలలో విడుదల కాబోతుందని కన్ఫామ్ చేశారు కానీ విడుదల తేదీని మాత్రం ఇంకా తెలియచేయలేదు. నిర్మాతలు మాటలను బట్టి చూస్తుంటే ఈ సినిమా మే 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని సమాచారం.
టైటిల్ కార్డ్స్ లో చీఫ్ మినిస్టర్ విజయ్..
ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన రాబోతోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదల కావడంతో ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో విజయ్ పేరు పక్కన దళపతి కాకుండా తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ నటించిన సినిమా అంటూ టైటిల్ కార్డ్స్ లో ఉండబోతున్న విషయం తెలిసిందే. ఇలా సినీ ఇండస్ట్రీలోనే మొదటిసారి టైటిల్ కార్డ్స్ లో ఒక హీరో పేరు పక్కన ముఖ్యమంత్రి రావటం ఇదే మొదటిసారి అని తెలుస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి విజయ్ ఆఖరి సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.