E-Paper
Advertisement

మటన్ కొట్టు అమ్మాయితో పెట్టుకుంటే పొట్టు పొట్టు నరికి… మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సామీ

మటన్ కొట్టు అమ్మాయితో పెట్టుకుంటే పొట్టు పొట్టు నరికి… మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సామీ
Advertisement

Action Thriller Movie on OTT : తెలుగు ప్రేక్షకులకు హనీ రోజ్ అంటే మొదట గుర్తొచ్చేది బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా. కానీ ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయి లాంటి మలయాళ మూవీ కూడా ఉంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపించిన హనీ రోజ్, ఇందులో కత్తి పట్టి వేటాడే మాస్ పాత్రలో నటించారు. ఆమె లుక్ కూడా చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుంది ఇందులో. ఈ సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇది హనీ రోజ్ అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చే ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ మూవీ. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే దీనికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఈ రివేంజ్ థ్రిల్లర్ మూవీ పేరు ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ పవర్‌ఫుల్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రాచెల్’ (Rachel). ఈ సినిమా ద్వారా ఆనందిని బాల దర్శకురాలిగా పరిచయం కాగా, ప్రముఖ దర్శకుడు ఏబ్రిడ్ షైన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. టైటిల్ రోల్ పోషించిన హనీ రోజ్, ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆమె కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రంగా ఇది నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇక స్వరూప్ ఫిలిప్ సినిమాటోగ్రఫీ, ఇషాన్ ఛబ్రా నేపథ్య సంగీతం సినిమాలోని ఇంటెన్సిటీని పెంచాయి. సినిమాలో యాక్షన్ సీన్లు చాలా కాస్త ఘోరంగా ఉండటం వల్ల సెన్సార్ బోర్డు దీనికి ‘A’ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దాదాపు 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం కుర్చీలకి కట్టిపడేస్తుంది. ఇది 2025 డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కాగా, ఓటీటీలో ఇంకా ఇది అందుబాటులోకి రాలేదు. అయితే prime Video, netflix లాంటి ఓటీటీలలో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రాచెల్ (హనీ రోజ్) ఒక కసాయి కూతురు. ఆ ఊళ్ళో ఆడాళ్ళంటే కేవలం వంట గదికే పరిమితం అనుకునే వాళ్ళ మధ్య, ఈమె మాత్రం తన తండ్రిలాగే కత్తి పట్టి మేకల్ని, గొర్రెల్ని నరుకుతూ గడుపుతుంటుంది. ఎవరికీ తలవంచకుండా తన పని తాను చేసుకుంటూ గుండె ధైర్యంతో బతుకుతుంటుంది. కానీ అంతా సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో ఆమె జీవితంలో ఒక పెద్ద తుపాను వస్తుంది. రాచెల్‌కు అత్యంత ఇష్టమైన వాళ్ళను ఎవరో దారుణంగా మోసం చేసి, బలి తీసుకుంటారు. అసలే కత్తి పట్టిన ఆడపిల్ల, ఆపై కసి పెరిగితే ఎలా ఉంటుందో ఆ దుర్మార్గులకు అస్సలు ఊహకు కూడా అందదు. తనవాళ్ళను పొట్టనబెట్టుకున్న ఆ నీచుల అడ్రస్ పట్టుకోవడానికి ఆమె నడుం బిగిస్తుంది. కన్నీళ్లు కార్చే టైపు కాకుండా, కత్తితో సమాధానం చెప్పే రకం మన రాచెల్. ఇక అక్కడి నుంచి సినిమా అంతా రక్తపాతమే. ఆ ఊళ్ళో ఉండే పెద్ద పెద్ద రౌడీలని, తప్పు చేసినోళ్లని ఏరికోరి మరీ వేటాడుతుంది. ఒక్కొక్కరిని నరుకుకుంటూ పోతుంటే, ఊరంతా వణికిపోవాల్సిందే. ఆఖరికి రాచెల్ పగ ఎలా చల్లారింది? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి ? అనేదే ఈ ఊర మాస్ ప్రతీకార కథ.

Read Also : 1 గంట 56 నిమిషాల ఈ థ్రిల్లర్ లో చివరి వరకు హంతకుడిని కనిపెట్టలేరు

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×