E-Paper
Advertisement

Nandini Reddy: పెళ్లిపై లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి షాకింగ్ కామెంట్.. అలాంటివాడు దొరకలేదంటూ!

Nandini Reddy: పెళ్లిపై లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి షాకింగ్ కామెంట్.. అలాంటివాడు దొరకలేదంటూ!
Advertisement

Nandini Reddy: సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కానీ ప్రసాద్ లు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే పెళ్లి కానీ ప్రసాదులే కాదు పెళ్లి కానీ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అటు హీరోయిన్లే కాదు ఇటు దర్శకురాలుగా సత్తా చాటుతున్న ఒక లేడీ డైరెక్టర్ కూడా ఒంటరిగానే కెరియర్ కొనసాగిస్తూ ఉండడం గమనార్హం . అలాంటి వారిలో ప్రముఖ లేడీ డైరెక్టర్ బీ. వీ.నందిని రెడ్డి కూడా ఒకరు . విభిన్నమైన కథాంశంతో అద్భుతమైన స్క్రీన్ విజువలైజేషన్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె వయసు ప్రస్తుతం 46 సంవత్సరాలు. ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న ఈమె తొలిసారి పెళ్లిపై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెళ్లిపై నందిని రెడ్డి కామెంట్..

నందిని రెడ్డి అనగానే చూడడానికి ప్యాంట్, షర్టు , మెన్ హెయిర్ కట్ తో అచ్చం అబ్బాయిలాగే దర్శనమిస్తుంది. నిజంగా ఈమె గురించి తెలియని వారు ఈమెను చూస్తే అబ్బాయేమో అని సందేహపడక మానరు.కానీ నందిని రెడ్డి గురించి తెలిస్తే మాత్రం ఆమె టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే .ప్రస్తుతం ఈయన వయసు 46 సంవత్సరాలు. ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ వృత్తిపరంగా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘దీవానా’.ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తొలిసారి తన పెళ్లిపై కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

నా నిజ జీవిత ఘటనే సినిమాలో..

తన మొదటి సినిమా ‘అలా మొదలైంది’ సినిమాలో హీరోయిన్ నిత్యమీనన్ పొరపాటున జెంట్స్ వాష్ రూమ్ లోకి వెళ్లే సీన్ గురించి ప్రస్తావిస్తూ.. నేను కూడా ఎన్నోసార్లు జెంట్స్ వాష్ రూమ్ లోకి వెళ్లే దాన్ని. అయితే అలా వెళ్లడానికి కూడా కారణం ఉంది. అప్పట్లో స్టూడియోల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఎందుకంటే సినిమా స్టూడియోలలో కేవలం పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండేవాళ్ళు. అందుకే వారి కోసమే వాష్ రూమ్స్ ఉండేవి. ఇక మహిళా టెక్నీషియన్లు చాలా తక్కువ మంది ఉండేవారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా వాష్ రూమ్ ఉండేవి కాదు.

Advertisement

ALSO READ:Tollywood: నాకు నత్తి ఉంది.. అవమానం భరించలేకపోయాను – స్టార్ హీరోయిన్

నాని లాంటి అబ్బాయి దొరుకుతాడా?

అందుకే నేను అలా జెంట్స్ వాష్ రూమ్ లకు వెళ్లి అలవాటైపోయింది. ఇక షూటింగ్ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసేదాన్ని. ఇక నా జీవితంలో జరిగిన సంఘటననే నేను అలా మొదలైంది సినిమాలో పెట్టాను. అందులో నిత్యామీనన్ జెంట్స్ వాష్ రూమ్ లోకి వెళితే.. నాని పరిచయం అవుతాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. కానీ నా నిజ జీవితంలో నేను జెంట్స్ వాష్ రూమ్ లోకి వెళ్లినా అక్కడ అలాంటిదేమీ జరగలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా కలిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానేమో.. కానీ ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి రోజు రాలేదు “అంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ నాని లాంటి అబ్బాయి నిజంగానే జెంట్స్ వాష్ రూమ్ లో దొరికితే నందిని రెడ్డి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందేమో అనే హింటు ఇచ్చింది ఈ లేడీ డైరెక్టర్. ఇకపోతే ఈమె మరొకవైపు సమంతతో మా ఇంటి బంగారం అనే సినిమాకి దర్శకత్వం వహిస్తోంది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×