E-Paper
Advertisement

Yami Gautam: ‘ధురంధర్ 2’లో యామీ గౌతమ్ పాత్ర గురించి తెలిస్తే షాక్ అవుతారు.. ఏం కనెక్ట్ చేశావు గురూ..

Yami Gautam: ‘ధురంధర్ 2’లో యామీ గౌతమ్ పాత్ర గురించి తెలిస్తే షాక్ అవుతారు.. ఏం కనెక్ట్ చేశావు గురూ..
Advertisement

Yami Gautam: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు, రణ్‌వీర్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుండగా, సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన యామీ గౌతమ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆమె పాత్రకు, గతంలో ఆమె నటించిన ఒక చిత్రానికి ఉన్న సంబంధం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నరేషన్ తో అదిత్యధర్ సినిమా రావడం చాలా ఆశ్యర్యానికి గురవుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ఆ పాత్ర ఏ సినిమాలో ఉన్న దానికి కనెక్షన్ ఉందా అని ఆరా తీస్తున్నారు. దాని గురించి తెలుసుకుని ఆశ్యర్య పోతున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా దర్శకుడు ఆదిత్యధర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read also-Mega 158 Film: హమ్మయ్య సెట్స్ పైకి మెగా 158.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?

పవర్‌ఫుల్ క్యామియో

Advertisement

‘ధురంధర్ 2’లో యామీ గౌతమ్ అతిథి పాత్రలో మెరిశారు. సినిమాలో అత్యంత కీలకమైన ఒక సన్నివేశంలో ఆమె కనిపిస్తారు. కథ ప్రకారం, పాకిస్థాన్‌లోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే భారత గూఢచారి (Indian Spy) పాత్రను ఆమె పోషించారు. శత్రువుల కళ్లుగప్పి ఒక ముఖ్యమైన టార్గెట్‌ను అంతం చేసే సీన్‌లో యామీ నటన మరియు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి.

‘హక్’ చిత్రంతో

చాలామంది ప్రేక్షకులు ఈ పాత్రను చూసి, గతంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ సినిమాలోని గూఢచారి పాత్రకు ఇది కొనసాగింపు ఏమో అని భావించారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడ లేదు. ఈ సినిమాలో యామీ గౌతమ్ ధరించిన నర్సు యూనిఫామ్ పై ఉన్న నేమ్ ట్యాగ్‌ను గమనిస్తే, దానిపై ‘షాజియా బానో’ అని ఉంటుంది. విశేషమేమిటంటే, యామీ గౌతమ్ గతంలో నటించిన ‘హక్’ అనే చిత్రంలో కూడా ఆమె పాత్ర పేరు ‘షాజియా బానో’. ఒకే పేరును వేరే సినిమాలో, అదే తరహా పాత్రకు వాడటం ద్వారా దర్శకుడు ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన ‘ఈస్టర్ ఎగ్’ లేదా ‘మెటా కనెక్షన్’ ఇచ్చారు. ఇది సినిమా ప్రేమికులకు ఒక స్పెషల్ ట్రీట్ లాంటిదని చెప్పవచ్చు.

Advertisement

Read also-Dhurandhar 2: పుష్ప2 రికార్డ్స్ లేపేసిన రణవీర్.. కలెక్షన్స్ తో ఊచకోత!

ప్రేక్షకుల స్పందన

సాధారణంగా గూఢచారి సినిమాల్లో ఇటువంటి కనెక్షన్‌లు ఉండటం వల్ల ఒక కొత్త ‘యూనివర్స్’ క్రియేట్ అవుతుందనే అంచనాలు పెరుగుతాయి. ‘ధురంధర్ 2’లో యామీ గౌతమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, కథను మలుపు తిప్పడంలో ఆమె పాత్ర చాలా కీలకం. మరోవైపు, ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. రణ్‌వీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసుకు షేక్ చేస్తుంది. నాలుగు రోజుల్లోనే అయిదు వందల కోట్లు వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేస్తుంది. సినిమాలోని యాక్షన్, సస్పెన్స్‌తో పాటు, యామీ గౌతమ్ పాత్రకు ఉన్న ఈ పాత సినిమా లింక్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా ఎన్ని పాత్రలకు ఈ సినిమాలో కనెక్షన్లు ఉన్నాయో అని ప్రేక్షకులు ఆరాతీస్తున్నారు.

Related News

ఈమెని వదిలితే ఇన్‌స్టా తగలబడిపోద్ది..నాగదుర్గపై బన్నీ వాస్ సెటైర్లు !

‘గరివిడి లక్ష్మి’ సినిమాని ఇంత మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా?

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

“వయలెంట్ మ్యాన్” ప్రభాస్ కి ‘సలార్ 2’ టీమ్ స్పెషల్ బర్తడే విషెస్.. క్రేజీ అప్డేట్ వైరల్!

ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కల్కి 2 నుండి ఆకట్టుకుంటున్న అప్డేట్!

Big Stories

Advertisement
×