E-Paper
Advertisement

Vishwak sen: ఆ సినిమా చూసి బాలయ్య, తారక్ అన్న క్లాస్ పీకారు: విశ్వక్ సేన్

Vishwak sen: ఆ సినిమా చూసి బాలయ్య, తారక్ అన్న క్లాస్ పీకారు: విశ్వక్ సేన్
Advertisement

Vishwak sen: టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen)ఒకరు. ఈయన హీరోగా ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో విశ్వక్ సినిమాల కంటే కూడా వివాదాలలో ఎక్కువగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన చేసే వీడియోలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఇక గత ఏడాది ఈయన నటించిన లైలా సినిమా(laila film) విషయంలో ఎలాంటి వివాదం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజకీయాల గురించి ప్రస్తావనకు రావడంతో ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి విశ్వక్ పెద్దగా బయట కూడా ఎక్కడ కనిపించలేదు.

జాతి రత్నాలు డైరెక్టర్ తో విశ్వక్..

ఇక ప్రస్తుతం ఈయన జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్(Anudeep) దర్శకత్వంలో మరొక క్రేజీ కామెడీ చిత్రం ఫంకీ(Funky) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో విశ్వక్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన బాలకృష్ణ(Balakrishna) జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ బాలయ్యతో చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. విశ్వక్ సినిమాలకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా  కూడా హాజరై మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయొద్దు..

Advertisement

ఇలా ఎన్టీఆర్ బాలయ్యతో ఎంతో సన్నిహితంగా ఉండే విశ్వక్ సేన్ కు వీరిద్దరూ బాగా క్లాస్ పీకారని ఈయన తెలియజేశారు. విశ్వక్ నటించిన లైలా సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారు తారక్ అన్న ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయొద్దు అంటూ తనకు బాగానే క్లాస్ పీకారని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక లైలా సినిమాలో విశ్వక్ అమ్మాయి గెటప్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఎన్నో వివాదాలు నడుమ గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత విశ్వక్ ఫంకీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Attitude star Chandrahas: మా నాన్న బాగా సంపాదించాడు.. హీరో కాకపోతే ఆ పని చేసే వాడిని: యాటిట్యూడ్ స్టార్

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×