E-Paper
Advertisement

Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’.. తాజా అప్డేట్ ఏంటంటే?

Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’.. తాజా అప్డేట్ ఏంటంటే?
Advertisement

Maa Vande: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ (PM Narendra Modi Biopic)‌ ‘మా వందే’ (Maa Vande) అనే టైటిల్‌తో గ్రాండ్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వీర్ రెడ్డి. ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా.. తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిచ్చేలా ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్. సీహెచ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో ఈ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్‌ను వారు తెలియజేశారు. ఈ అప్డేట్ ఏంటంటే..

Also Read- Vijay Sethupathi: మాట మీద నిలబడని విజయ్ సేతుపతి.. ఆ సినిమాలో పాత్ర కోసమే ఇదంతా..!

హైదరాబాద్ పూర్తి.. నెక్ట్స్ కశ్మీర్

Advertisement

‘మా వందే’ చిత్రం హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించామని తెలుపుతూ.. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను టీమ్ విడుదల చేసింది. ఈ స్టిల్స్ గమనిస్తే.. టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉన్ని ముకుందన్ కూడా ఈ ఫొటోలో సరదాగా టీమ్‌తో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అప్డేట్‌లో ‘మా వందే’ నెక్ట్స్ షెడ్యూల్ కోసం కశ్మీర్ వెళ్తున్నట్లుగా టీమ్ మెంబర్స్ తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Also Read- Drug Bust: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులకు చిక్కిన సౌత్ హీరోయిన్!

400 కోట్లకు పైగా బడ్జెట్‌తో..

Advertisement

ఇక ఈ సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ హ్యూజ్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టుబోతున్నారట. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలోనే తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆక్వామ్యాన్‌’లో హీరోగా నటించిన జేసన్ మమొవాను ‘మా వందే’ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి స్టార్ యాక్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశామని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు.

Also Read- Nabha Natesh: నాభి అందాలతో గత్తరలేపుతున్న నభా నటేష్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×