E-Paper
Advertisement

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్
Advertisement

Lalo Remake:‘లాలో – కృష్ణ సదా సహాయతే’…కేవలం రూ. 50 లక్షల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించిన సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఈ సినిమాని తెలుగు రీమేక్ చేయబోతున్నారని, దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి కూడా.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ

Advertisement

ఇక తాజాగా ఇందులో కృష్ణుడిగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనే వార్త కూడా వైరల్ అయ్యింది. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు కృష్ణుడి పాత్ర పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అందరూ భావించారు కూడా . అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తప్పుకోవడంతో, ఆ ప్లేస్‌లోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ మరియు రొమాంటిక్ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడి గెటప్‌లో కనిపించనున్నాడనే వార్త బయిటకు రాగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ అయింది.

అభిమానులకి మాంచి ఐ ఫీస్ట్

Advertisement

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కొద్దిసేపు మెరిసిన విజయ్, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అప్పట్లో ప్రేక్షకులను ఎలా మెప్పించాడో చెప్పక్కర్లేదు . ఇప్పుడు అదే తరహాలో మోడ్రన్ టచ్ ఉన్న శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన పూర్తిస్థాయిలో నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి.ఇదే నిజమైతే మాత్రం అభిమానులకి మాంచి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.

నిర్మాతగా  దిల్ రాజు 

గుజరాతీ నేటివిటీని పక్కనపెట్టి, తెలుగు ప్రేక్షకుల ఊహలకు, కమర్షియల్ హంగులకు తగినట్లుగా స్క్రీన్ ప్లే లో మార్పులు చేసి దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా ప్లాన్ చేస్తున్నారట . ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఈ డివోషనల్ డ్రామాకు ఓకే చెబితే మాత్రం అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి.ఇక రష్మికని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైన విజయ్ ప్రస్తుతం రణబాలి అలాగే రౌడీ జనార్ధన అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

ఇక లాలో కథ విషయానికి వస్తే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఒక సాధారణ ఆటో డ్రైవర్ జీవితంలోకి శ్రీకృష్ణుడు వచ్చి అతనికి ఎలా మార్గదర్శనం చేశాడనే పాయింట్‌పై ఈ సోషియో-ఫాంటసీ చిత్రం రూపొందింది. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

Tags

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×