E-Paper
Advertisement

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!
Advertisement

KTR: కేసీఆర్ అసెంబ్లీకి రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే సీఎంగానే వ‌స్తాడు. ఏం చేసుకుంట‌రో చేసుకోండని కేటీఆర్ ఖుల్లంఖుల్లాగా చెప్పేశారు. సీఎంగానే వ‌స్తారు త‌ప్ప ప్రతిప‌క్ష నేత‌గా కాద‌ని తేల్చి చెప్పేశారు కేటీఆర్‌. మీకు చేత‌గాక‌పోతే త‌ప్పుకోండి కానీ ప‌దే ప‌దే కేసీఆర్ వెంట ప‌డ‌కండ‌న్నారు.

మా స‌ర్కారేన‌నే ధీమా వ్యక్తం..

అసెంబ్లీకి రావాలె రావాలె  అని మీరెంత మొత్తుకున్నా ఆయ‌న ఫామ్‌హౌజ్ విడిచి బ‌య‌ట‌కు వ‌చ్చేదీ లేదు. అసెంబ్లీలో అడుగు పెట్టేదీ లేదు అని తీర్మానించేశారు కేటీఆర్‌. అధికార పార్టీ కేసీఆర్ రాజీనామా డిమాండ్‌పై ఈ విధంగా స్పందించారు. సీఎం హోదాలో ఎలా మ‌ట్లాడాలో తెలియ‌ని రేవంత్ ఉన్నంత కాలం కేసీఆర్ అక్కడ అడుగు పెట్టలేర‌ని స‌మ‌ర్థించుకునే ప్రయ‌త్నం చేశారు. సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడ‌తారు అని చెప్పడం వెనుక వచ్చేది మా స‌ర్కారేన‌నే ధీమా వ్యక్తం చేశారాయ‌న‌. ప్రజ‌ల ఆశీర్వాదాలుంటే త‌ప్పకుండా గెలుస్తామ‌ని ఓట‌ర్లను విజ్ఞప్తి చేసుకున్నట్టుగా కూడా క‌వ‌ర్ చేసుకున్నారు కేటీఆర్‌.

Advertisement

Also read: హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

 కేసీఆర్ రాజీనామా..

కేసీఆర్ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌పైనా త‌న‌దైన శైలిలో ఎదురుదాడికి దిగారు కేటీఆర్‌. కేసీఆర్ రాజీనామా చేస్తేనే తెలంగాణ వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ఒక్కసారి రాజీనామాకే ఢిల్లీ గ‌డ‌గ‌డలాడింద‌న్న ఆయ‌న‌ సోనియాకు వీపు ప‌గులుతుంద‌నే భ‌యం ప‌ట్టుకుంద‌ని మాట తూలారు. మీ నాయ‌కులే కేసీఆర్ రాజీనామాను త‌ట్టుకోలేక‌పోయారు. నీతో అవుతుందా? ఆలోచించుకో మ‌రి అని సీఎంను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు కేటీఆర్‌.

రేవంత్ రెడ్డి ఉన్నంత‌కాలం..

Advertisement

మ‌ళ్లీ కేసీఆర్ టైం వ‌స్తద‌ని ఆయ‌నే సీఎం కాబోతున్నార‌నే విధంగా కామెంట్ చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నంత‌కాలం కేసీఆర్ అసెంబ్లీకి రాడ‌నే విష‌యం పై క్లారిటీ ఇచ్చిన‌ట్టే ఉన్నాయి కేటీఆర్ కామెంట్స్‌.  అంటే.. బీఆరెస్ అధికారంలోకి వ‌స్తేనే ఆయ‌న సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడ‌తాడు. అప్పటి వ‌ర‌కు అసెంబ్లీ ముఖ‌మే చూడ‌ర‌ని చెప్పేశారు కేటీఆర్‌. అంటే మ‌రో రెండేళ్లు ఫామ్‌హౌజ్ కేసీఆర్, రాజీనామా చెయ్ కేసీఆర్ అనే కాంగ్రెస్ నినాదాలు స‌జీవంగానే ఉంటాయ‌న్నమాట‌.

Also read: క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Tags

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

Big Stories

Advertisement
×