Engineering Freshers Jobs| ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? GATE 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం కంపెనీ GAIL ఇప్పుడు మంచి అవకాశాన్ని ప్రకటించింది. GATE స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.
ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ GAIL (India) Limited ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. GATE 2027 పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనుంది. కెమికల్, ఎలెక్ట్రికల్, ఇన్‌స్ట్రూమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టులు అందుబాటులో ఉన్నాయి. GAILలో నాలుగు ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. పై తెలిపిన విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఇంజినీరింగ్ డిగ్రీకి సంబంధించిన విభాగంలోనే GATE పరీక్ష రాసి ఉండాలి. ఈ నియామకానికి GATE 2027 స్కోర్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గతంలో రాసిన GATE 2026 లేదా అంతకుముందు సంవత్సరాల స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 26 సంవత్సరాలు. ఈ వయస్సును 2027 మార్చి 18 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్థులకు గరిష్ఠంగా ఐదేళ్లు, OBC-NCL అభ్యర్థులకు మూడేళ్లు, PwBD అభ్యర్థులకు గరిష్ఠంగా పదేళ్ల వయస్సు సడలింపు లభిస్తుంది.
అభ్యర్థులు ముందుగా GATE 2027 పరీక్షకు రిజిస్టర్ చేసుకుని పరీక్ష రాయాలి. GATE అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత అందులో ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి. GAIL దరఖాస్తు సమయంలో ఈ GATE 2027 రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత GAIL అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను స్వీకరించరు. ఒక్క అభ్యర్థి ఒకే పోస్టు లేదా ఒకే ఇంజినీరింగ్ విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో
GAIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2027 ఫిబ్రవరి 17 ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు 2027 మార్చి 18 సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రాకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
GATE 2027లో సాధించిన మార్కుల ఆధారంగా GAIL అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్ చేస్తుంది. సంస్థ అవసరాలు, అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అందువల్ల GATE 2027కు సిద్ధమవుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించి, GAIL అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.
Also Read: ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ