E-Paper
Advertisement

Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే స్పిరిట్ రిలీజ్?

Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే స్పిరిట్ రిలీజ్?
Advertisement

Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పాన్ ఇండియా  స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ప్రభాస్ ఈ ఏడాది మారుతి డైరెక్షన్లో నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాదిలోనే స్పిరిట్ రిలీజ్…

ఇక ఈ సినిమా విడుదల కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ (Spirit) సినిమా పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్పిరిట్ సినిమా షూటింగ్ పనులు గత ఏడాది డిసెంబర్ లోనే మొదలయ్యాయి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కు ఎంతో మంచి ఆదరణ లభించింది.

మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్..

Advertisement

ఇదివరకు  ఎప్పుడు కనిపించని విధంగా ప్రభాస్ ఎంతో విభిన్నమైన లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతోంది. అయితే ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ అనుకున్న దానికంటే ముందుగానే ఈ సినిమా విడుదల కాబోతోందని తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.

2026 డిసెంబర్లోనే విడుదల..

Advertisement

ఈ సినిమా 2027లో కాకుండా 2026 డిసెంబర్లోనే విడుదల చేయాలనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. 2027 లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాని విడుదల చేయడం సరైనదని భావించిన సందీప్ రెడ్డి అదే దిశగా షూటింగ్ పనులను కూడా పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించినట్టు తెలుస్తుంది.  ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ,ఈ ఏడాదిలోనే స్పిరిట్ సినిమా విడుదల కాబోతుంది అనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాదిలోనే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ఫాజి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది.

Also Read: Allu Aravind:  బాస్ ఈజ్ బాస్.. శంకర్ వరప్రసాద్ పై అల్లు అరవింద్ రివ్యూ..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×