Pakistan Team: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో గెలవాల్సిన పాకిస్తాన్… చేతులు దులుపుకుంది. దీంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా… న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. అయితే, సోమవారం ఉదయం కొలంబో నుంచి కరాచీ చేరుకుంది పాకిస్తాన్ టీమ్ ( Pakistan team). అయితే కరాచీ విమానాశ్రయంలో ( Karachi airport ) పాకిస్తాన్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ ఆడి వచ్చిన పాకిస్తాన్ ప్లేయర్లను చూసేందుకు అభిమానులు ఒక్కరు కూడా రాలేదు. సాధారణ ప్రయాణికుల లాగానే విమానాశ్రయంలో మెరిసారు పాకిస్తాన్ క్రికెటర్లు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వెధవలను చూసేందుకు ఒక్క అభిమాని కూడా రాలేదని ఆడుకుంటున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సూపర్ 8 దాకా వచ్చి ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. గ్రూప్ స్టేజ్ లో నమీబియా, నెదర్లాండ్స్ , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి జట్ల పైన మాత్రమే విజయం సాధించి ఇంటిదారి పట్టింది. అటు గ్రూప్ స్టేజిలో టీమిండియా చేతిలో చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయలేక విఫలమైంది. దీంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కొలంబో నుంచి సోమవారం రోజున కరాచ విమానాశ్రయానికి చేరుకుంది పాకిస్తాన్ టీం. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు ఎలాంటి భద్రత కల్పించలేదు అక్కడి సర్కార్.
అలాగే ఈ ప్లేయర్లను చూసేందుకు విమానాశ్రయానికి అభిమానులు కూడా పెద్దగా రాలేదు. ఇండియాలో అయితే వేలాది సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి చేరుకుంటారు. కానీ పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి కనిపించలేదు. పట్టుమని పదిమంది అభిమానులు కూడా రాలేదు. ఆ వచ్చిన అభిమానులు ఏకంగా పాకిస్తాన్ క్రికెటర్ల భుజాలపై చేతులు వేసి దర్జాగా ఫోటోలు దిగారు. ఇక అభిమానుల ఓవరాక్షన్ ఆపేందుకు సెక్యూరిటీ కూడా లేదు. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ఇండియన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను వాళ్ళ దేశంలో కుక్క కూడా దేకడం లేదని అంటున్నారు.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో దారుణంగా విఫలం కావడం… ఇండియా చేతిలో గ్రూప్ స్టేజ్ లో ఓడిపోవడం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు పూనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో పాకిస్తాన్ ప్లేయర్ 50 లక్షల రూపాయలు బోర్డుకు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయని సమాచారం. డబ్బులు కట్టకపోతే ఇకపై జట్టులో ఆడబోరని వార్నింగ్ కూడా ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
🚨 Pakistan team arrived at Karachi airport, but look at the public; nobody is giving a f"ck about them, man.
In India, people gather in crowds of thousands even for domestic players.
Even look at the airport; it looks like some bus stand. 😂
pic.twitter.com/DsA9qDnkNN— Tejash (@Tejashyyyyy) March 2, 2026