E-Paper
Advertisement

Lavanya Tripathi: మా లవ్ ను నిహారిక క్రాక్ చేసింది.. అసలు స్టోరీ బయటపెట్టిన లావణ్య!

Lavanya Tripathi: మా లవ్ ను నిహారిక క్రాక్ చేసింది.. అసలు స్టోరీ బయటపెట్టిన లావణ్య!
Advertisement

Lavanya Tripathi: మెగా కోడలు, సినీ నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ప్రస్తుతం సతీ లీలావతి(Sathi Leelavathi) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 6 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. లావణ్య పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా కావటం విశేషం ఈ సినిమాలో ఈమెకు జోడిగా నటుడు దేవ్ మోహన్ నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ చూస్తేనే తెలుస్తోంది.

వరుణ్ ఆఫీసులో దొరికిపోయా..

ఇక ఈ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాటికి నిహారిక (Niharika)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నిహారిక చాలా స్వీట్ పర్సన్ అని తను నాకు ఒక సిస్టర్ లాంటిదని తెలిపారు. అలాగే తమ లవ్ స్టోరీ గురించి కూడా మాట్లాడుతూ మా లవ్ స్టోరీ గురించి ఫస్ట్ నిహారికకి తెలుసు అంటూ లావణ్య ఈ సందర్భంగా తెలియజేశారు. తాను వరుణ్ ప్రేమలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా వరుణ్ ఆఫీస్ లోనే ఉండేదాన్ని. ఇలా తను ఎప్పుడు వరుణ్ ఆఫీస్ లో ఉన్న ఆ సమయంలో నిహారిక అక్కడికి వచ్చేది అలా మా ఇద్దరినీ చాలాసార్లు చూసింది. ఇలా ఇద్దరం కలిసి కనిపించేసరికి మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ తానే ఫస్ట్ మా లవ్ స్టోరీని క్రాక్ చేసిందని ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బిజినెస్ ఆలోచనలో లావణ్య త్రిపాఠి..

Advertisement

ఇక నిహారిక ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీరు కూడా మీ ఆడపడుచు బాటలోనే ప్రొడ్యూసర్ గా మారుతారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు లావణ్య సమాధానం చెబుతూ నిహారిక, హాని అక్క(సుస్మిత) వీరిద్దరికి ప్రొడక్షన్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదని, అందుకే నేను ప్రొడక్షన్ వైపు రానని తెలియజేశారు. కాకపోతే నిహారిక ప్రొడక్షన్ లో సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇక తనకు ప్రొడక్షన్ వైపు ఆసక్తి లేదు కానీ బిజినెస్ చేయాలని కోరికగా ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. ప్రస్తుతం బాబు చిన్నవాడు కావడంతో కాస్త పెద్దయిన తరువాత తాను బిజినెస్ స్టార్ట్ చేస్తానని లావణ్య తెలిపారు. అయితే ఏం బిజినెస్ చేస్తారనేది మాత్రం ఈమె వెల్లడించలేదు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లావణ్య తన కెరియర్ గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Vishwanath And Sons: దెబ్బకు దిగొచ్చిన సూర్య మేకర్స్ …తెలుగు టైటిల్ తో కొత్త పోస్టర్!

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×