E-Paper
Advertisement

Toxic vs Dhurandhar 2: రెండిట్లో ఈ సినిమానే విన్నర్.. అప్పుడే వచ్చేసిన రిజల్ట్..!

Toxic vs Dhurandhar 2: రెండిట్లో ఈ సినిమానే విన్నర్.. అప్పుడే వచ్చేసిన రిజల్ట్..!
Advertisement

Toxic vs Dhurandhar 2: మార్చి నెలలో బాక్సాఫీస్ దగ్గర భారీ పోరు జరగబోతోంది. ఒకే రోజు విడుదలకానున్న ధురంధర్ 2 మరియు టాక్సిక్ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండింటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మార్చి 19, 2026న ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నాయి. ఒకవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ధురంధర్ 2, మరోవైపు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో రూపొందిన టాక్సిక్. కథ, నటీనటులు, ప్రమోషన్లు అన్నీ బలంగా ఉండటంతో ఈ క్లాష్‌పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

అడ్వాన్స్ బుకింగ్ జోరు..!

Advertisement

ఇప్పటికే విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొదటి ట్రెండ్స్‌ను గమనిస్తే ధురంధర్ 2కు మంచి ఆధిక్యం కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ టికెట్లు అమ్ముడవడం వల్ల ట్రేడ్ వర్గాలు ఈ సినిమాను ముందంజలో ఉన్న మూవీగా భావిస్తున్నాయి. టాక్సిక్ కూడా బుకింగ్స్‌లోకి వస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ధురంధర్ 2తో పోలిస్తే కాస్త వెనుకబడి ఉన్నట్లు సమాచారం.

బ్లాక్ బస్టర్ వస్తువులు సాధించిన దురందర్ సినిమాకి సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి అంశాలు, భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ ఈసారి మరింత పెద్ద స్థాయిలో కథను తెరకెక్కించాడని సినీ వర్గాల్లో టాక్ తెగ నడుస్తోంది.

టాక్సిక్ పరిస్థితి ఏమిటి.‌!

Advertisement

ఇక టాక్సిక్ విషయానికి వస్తే, ఇందులో యశ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. కేజీఎఫ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డార్క్ గ్యాంగ్‌స్టర్ కథ, స్టైలిష్ ప్రెజెంటేషన్, పవర్‌ఫుల్ పాత్ర ఈ సినిమాకు ప్లస్ అవుతాయని అంచనా. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గీతూ మోహన్ దాస్ టాక్సిక్‌ను పూర్తిగా కొత్త టోన్‌లో చూపించబోతున్నారని సమాచారం.

ఇప్పటి వరకు వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్‌ను బట్టి చూస్తే ధురంధర్ 2 స్పష్టంగా ముందంజలో ఉంది. అయితే అసలు గెలుపు మాత్రం సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల తీర్పుతోనే తేలుతుంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమానే చివరికి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడం ఖాయం.

ALSO READ: Niharika Konidela:పవర్ స్టార్ కూతురు.. పవర్ బిల్ కట్టలేరా.. నిహారికకి అదిరిపోయే పంచ్ వేసిన వంశీ..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×