E-Paper
Advertisement

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌లో బీసీలకు పెద్దపీఠ.. త్వరలో జిల్లా కమిటీలన్నీ పూర్తి.. టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌లో బీసీలకు పెద్దపీఠ.. త్వరలో జిల్లా కమిటీలన్నీ పూర్తి.. టీపీసీసీ చీఫ్
Advertisement

Mahesh Kumar Goud: కాంగ్రెస్ లో మాత్రమే బీసీలకు పెద్దపీఠ లభిస్తుందని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ లో జరిగిన డీసీసీ అధ్యక్షుల మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల పాటు పార్టీ సిద్ధాంతాలపై సంపూర్ణంగా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనడం చరిత్రాత్మకమైందన్నారు.

రాహుల్ గాంధీ చూపిన బాటలో తెలంగాణలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని టీపీసీసీ చీఫ్ అన్నారు. వంద ఏళ్లలో చేయని కుల గణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అసెంబ్లీ లో బిల్లు పాస్ చేయించారన్నారు. ఆ బిల్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తే పార్టీ పరంగా బీసీలకు టిక్కెట్లు కేటాయించామన్నారు.

Advertisement

Also Read: GHMC CRMP-2: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీ నాయకులను గెలిపించుకున్నామన్నారు. చట్టపరంగా 28 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉంటే అనేక జనరల్ స్థానాలలో బీసీలను నిలబెట్టి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఇదంతా రాహుల్ గాంధీ చొరవ వలనే సాధ్యమైందన్నారు. అత్యంత కీలకమైన డీసీసీ ల నియామకంలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. త్వరలోనే అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేసి పార్టీని మరింత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతామన్నారు.

Advertisement

Also Read: Air Cooler Buying Tips: బెస్ట్ కూలర్‌ ఎంచుకునే 4 చిట్కాలు.. వీటిని పాటించకపోతే.. మీ డబ్బు వృథానే!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×