Lavanya Tripathi: లావణ్య త్రిపాటి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అందాల రాక్షసి అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఏకంగా తెలుగింటి కోడలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ను ఈమె పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లావణ్య నటించిన సతీ లీలావతి సినిమా మే 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాతినేని సత్య దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ మే 8వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.. ఈ ట్రైలర్ వీడియో ప్రముఖ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇలా ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేయడంతో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ గురించి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సతీ లీలావతి సినిమా ట్రైలర్ రామ్ చరణ్ లాంచ్ చేయడంతో లావణ్య త్రిపాటి రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చరణ్ బావకు చాలా థాంక్స్ అంటూ మాట్లాడారు. ఇలా రాంచరణ్ బావ అంటూ సంబోధించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ మీరు ఇంట్లో కూడా రామ్ చరణ్ గారిని భావా అని పిలుస్తారా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు లావణ్య సమాధానం చెబుతూ తాను రాంచరణ్ గారిని బావ అని పిలవాలా? లేక RC అని పిలవాలా? అని అడిగితే ఆయన RC అని పిలవమన్నారు అందుకే అలాగే పిలుస్తానని సమాధానం ఇచ్చారు.
అన్నయ్య లాగా సపోర్ట్ చేస్తారు..
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ప్రతి విషయంలో తనకు ఒక అన్నయ్య లాగే సపోర్ట్ చేస్తారు అంటూ లావణ్య త్రిపాఠి చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బావని పట్టుకొని అన్నయ్య అని పిలవడం ఏంటి ,చరణ్ వరసకు బావ కదా అవుతారు, అన్నయ్యలా సపోర్ట్ చేయడం ఏంటి అంటూ ఈమె వ్యాఖ్యలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరమవుతుందని అందరూ భావించారు కానీ ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: తమిళనాడు ఎన్నికలు ఫలితాల వేళ.. సంచలనంగా మారిన త్రిష పోస్ట్!